ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan: వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్

ABN, Publish Date - Apr 29 , 2024 | 07:44 AM

కాకినాడ జిల్లా: గోదావరి జిల్లాల్లో కాపులకు, దళితులకు మధ్య చిచ్చు పెట్టాలనేదే సీఎం జగన్‌ కుయుక్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దున్నని భూమి, ఉండని ఇళ్లు.. అన్నీ జగన్‌ లాగేసుకుంటారని స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్‌ ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ కీలకనేతల కనుసన్నల్లో తుని రైలు దహనం ఘటన జరిగిందని మండిపడ్డారు. వైసీపీకి ఓటేస్తే మనల్ని మనమే కిరోసిన్‌ పోసుకుని తగలబెట్టుకున్నట్లని హెచ్చరించారు. ఆదివారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో జరిగిన ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌ ప్రభుత్వానికి అసలు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.

1/6

కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడిలో జరిగిన వారాహి విజయభేరి సభకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జిల్లా నేతలు గజ మాలతో సన్మానిస్తున్న దృశ్యం.

2/6

జనసేనాని పవన్ కల్యాణ్ జగ్గంపేట నియోజక వర్గం, కిర్లంపూడిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.

3/6

జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడిలో జరిగిన వారాహి విజయభేరి సభకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అభిమానులు పూల వర్షం కురిపిస్తున్న దృశ్యం.

4/6

ఆదివారం కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్.. కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న దృశ్యం..

5/6

జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడిలో జరిగిన వారాహి విజయభేరి సభలో ప్రసంగిస్తున్న జనసేన నేతలు..

6/6

కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయభేరి సభకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలు

Updated Date - Apr 29 , 2024 | 07:44 AM

Advertising
Advertising