గుంటూరు: వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం ఉదయం ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు. స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదని పవన్ ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులు సైలెంట్‌గా ఉండి మహా అపరాధం చేశారని, అందుకే తాను దీక్ష తీసుకున్నానని పవన్ చెప్పారు. ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ది కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.