ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రోన్‌ భళా.. విన్యాసాలు అదుర్స్‌..

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:09 AM

విజయవాడ: అమరావతి డ్రోన్‌ షో రికార్డులు బద్దలు కొట్టింది. సరికొత్త ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. మొత్తం ఐదు విభాగాలలో గిన్నిస్‌ రికార్డులను నెలకొల్పింది. డ్రోన్‌ షోను వీక్షించటం కోసం వచ్చిన జనంతో కృష్ణానదీ తీరం పులకించింది. ప్రధాన వేదిక పున్నమిఘాట్‌ కిక్కిరిసింది. రాత్రి 8.30 గంటలకు డ్రోన్‌షో మొదలైంది. ఒక్కసారిగా ఆకాశంలో నక్షత్రాలుగా 5,500 డ్రోన్లు పైకి లేచాయి. ఆకాశంలో వేలాది నక్షత్రాలుగా కనిపించిన డ్రోన్లు.. ఆ తర్వాత కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ను డ్రోన్‌ సెన్సార్లు స్వీకరించి అత్యద్భుత ప్రదర్శన చేశాయి. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఏర్పాటు చేసిన డ్రోన్ షో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

1/10

విజయవాడలోని పున్నమి ఘాట్లో డ్రోన్ షో.. జాతీయ జెండాను ఆవిష్కరించిన దృశ్యం.. తిలకిస్తున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

2/10

డ్రోన్ షో ద్వారా ఏర్పాటు చేసిన ఇండియా మ్యాప్.. కనువిందు చేస్తున్న దృశ్యం..

3/10

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో డ్రోన్స్ షోను తిలకిస్తున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. మంత్రి అచ్చె్న్నాయుడు తదితరులు..

4/10

అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌లో విమానయాన రంగానికి లె గసీగా చెప్పుకొనే ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ అతిపెద్ద లోగోను డ్రోన్లు ఆవిష్కరించాయి.

5/10

అమరావతి డ్రోన్‌ షో ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు..

6/10

డ్రోన్ షో తిలకించేందుకు వచ్చిన విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

7/10

డ్రోన్ షోలో నృత్య ప్రదర్శన చేసిన కళాకారులతో సీఎం చంద్రబాబు..

8/10

విజయవాడలోని పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన డ్రోన్ షోకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.

9/10

సైకిలెక్కిన ఆక్రోబాట్‌ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

10/10

ఒక్కసారిగా ఆకాశంలో నక్షత్రాలుగా 5,500 డ్రోన్లు పైకి లేచాయి. ఆకాశంలో వేలాది నక్షత్రాలుగా కనిపించిన డ్రోన్లు..

Updated Date - Oct 23 , 2024 | 11:09 AM