ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహర్షి వాల్మీకి జయంతోత్సవాలు..

ABN, Publish Date - Oct 18 , 2024 | 11:42 AM

అనంతపురం: రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. నేటితరం యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతపురం నగరంలో గురువారం వాల్మీకి మహర్షి రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పాతూరు పవర్‌ ఆఫీస్‌ సమీపంలోని వాల్మీకి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుత్తి రోడ్డులోని బల్లా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నారు. వాల్మీకి జయంతి వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించడం ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు.

1/7

అత్యంత వైభవంగా మహర్షి వాల్మీకి జయంతోత్సవాలు..

2/7

ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి అనంతపురం, పాతూరు పవర్‌ ఆఫీస్‌ సమీపంలోని వాల్మీకి విగ్రహానికి మంత్రి సవిత పూలమాలలు వేసి .. జ్యోతి ప్రజ్వలన చేసిన దృశ్యం.

3/7

మహర్షి వాల్మీకి జయంతోత్సవాల్లో ప్రసంగిస్తున్న మంత్రి సవిత..

4/7

మహర్షి వాల్మీకి జయంతోత్సవాల్లో వాల్మీకి వేషధారణ..

5/7

వాల్మీకి రచించిన రామాయణాన్ని నాటకం ద్వారా వినిపిస్తున్న బాలలు..

6/7

వాల్మీకి జయంతోత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, నాయకులతో మంత్రి సవిత..

7/7

మహర్షి వాల్మీకి జయంతోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరైన జనం..

Updated Date - Oct 18 , 2024 | 11:42 AM