YS Sunitha: అన్ని సాక్ష్యాలున్నా న్యాయం చేయడంలో జాప్యం.. వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్
ABN , Publish Date - Apr 15 , 2024 | 05:29 PM
వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. జగన్‌పై జరిగిన దాడి.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం ఎవరితోనైనా మాట్లాడతానని అందుకే సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అడిగానని వైఎస్ సునీత తెలిపారు.
వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. జగన్‌పై జరిగిన దాడి.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం ఎవరితోనైనా మాట్లాడతానని అందుకే సీఎం జగన్ అపాయింట్‌మెంట్ అడిగానని వైఎస్ సునీత తెలిపారు. అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాసినా స్పందన రాలేదన్నారు. విమలమ్మ అన్నపై చూపిన ప్రేమ ఇదేనా అని సునీత ప్రశ్నించారు.
మొదట రిమాండ్‌లో సీబీఐ నలుగురి పేర్లు చెప్పిందన్నారు వైఎస్ సునీత. ఏ-1 ఎర్ర గంగిరెడ్డి, ఏ-2 యాదాటి సునీల్ యాదవ్, ఏ-3 గజ్జల ఉమా శంకర్ రెడ్డి, ఏ-4 దస్తగిరి, అవినాష్‌తో నిందితులకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయని సునీత చెప్పారు. సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ ల కాల్ డేటా చూస్తే వీరి మధ్య సంబంధాలు తెలుస్తున్నాయని వివరించారు.
న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇన్ని సాక్ష్యాలున్నా న్యాయం జరగలేదు. ప్రజలకు నిజం తెలవడానికే ప్రజల ముందుకు తెచ్చా. ప్రజా తీర్పు కోసమే ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నా. పైస్థాయిలో ఒత్తిళ్ల వల్లే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదు. సీబీఐ ఇంకా విచారణ చేయాల్సి ఉందని సునీత అన్నారు.
వివేకా హత్యను మొదట సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేశారు. వివరాలు వెల్లడిస్తూ వివేకా కుమార్తె సునీత భావోద్వేగానికి గురయ్యారు. ఐదేళ్ల కింద నాది ఒంటరి పోరాటం.
తెలుగు రాష్ట్రాలు నా పోరాటానికి మద్దతిస్తున్నాయి. మద్దతిస్తున్న ప్రజలందరికీ సునీత కృతజ్ఞతలు తెలిపారు.
ఎం.వి కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడు. శివశంకర్‌రెడ్డికి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. భాస్కర్‌రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 నుంచి 16 ఉదయం వరకు స్విచ్ఛాఫ్.
అవినాశ్‌రెడ్డి మాత్రం వీళ్లెవరో తెలియదని చెబుతున్నారు. గంగిరెడ్డి, అవినాష్ మధ్య పలుమార్లు వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయని సునీత వివరించారు.
వివేకా హత్యకు మూడు వారాల ముందు దస్తగిరి అవినాష్ ఇంటికి వెళ్లిన్నట్లు ఆడియో ఉంది. వివేకా హత్య కేసులో నిందితులు నాకు తెలియదని అవినాష్ చెప్పారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారు.
Updated Date - Apr 15 , 2024 | 05:29 PM