ఘనంగా కొమరవెల్లి మల్లన్న కళ్యాణం
ABN, Publish Date - Dec 30 , 2024 | 08:18 AM
సిద్దిపేట: జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో కొలువైన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా జరిగింది. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయం తోటబావి ప్రాంగణంలో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న.. మేడలాదేవీ, కేతలమ్మను వివాహమాడారు. ఆర్‌జేసీ రామకృష్ణారావు పర్యవేక్షణలో ఆలయ ఈవో బాలాజీశర్మ, ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణాన్ని కనుల పండువగా జరిపారు.
Updated Date - Dec 30 , 2024 | 08:18 AM