ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

America: డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం

ABN, Publish Date - Nov 07 , 2024 | 10:53 AM

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహ్యారిస్‌తో ఆద్యంతం ఉత్కంఠగా.. ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా సాగిన పోరులో ట్రంప్‌ అప్రతిహత విజయాన్ని సాధించారు. 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లకు గాను.. అధ్యక్ష పదవిని చేపట్టడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 270ని సునాయాసంగా దాటేసిన ట్రంప్‌.. కడపటి వార్తలందేసరికి 292 చోట్ల విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆ సమయానికి ట్రంప్‌ ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలాహ్యారిస్‌ 224 ఎలక్టోరల్‌ సీట్లను కైవసం చేసుకున్నారు. ముందు నుంచి సర్వేలు ట్రంప్‌నకు అటూఇటుగానే ఉన్నా.. ఓటర్లు మాత్రం ఆయనకు అండగా నిలిచారు. ఈ ఘన విజయంతో ట్రంప్‌ మరో అరుదైన రికార్డును సాధించారు.

1/7

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు.

2/7

ఎన్నికల ఫలితాల అనంతరం సతీమణి మెలానియాతో కలిసి అభివాదం చేస్తున్న డోనాల్డ్ ట్రంప్..

3/7

గెలుపు తర్వాత సంతోషంతో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ట్రంప్..

4/7

భర్త విజయం సాధించడంతో డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం..

5/7

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించిన తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్‌తో డోనాల్డ్ ట్రంప్..

6/7

అమెరికా ఉపాధ్యక్షుడిగా విజయం సాధించిన జేడీ వాన్స్.. సతీమణి చిలుకూరి ఉష (సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా)తో..

7/7

ఉపాధ్యక్షుడిగా విజయం సాధించిన జేడీ వాన్స్.. అభిమానులకు షేక్‌హ్యాండ్ ఇస్తూ.. భార్య చిలుకూరి ఉషతో కలిసి సందడి చేశారు.

Updated Date - Nov 07 , 2024 | 10:53 AM