ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహాశక్తి గణపతికి తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి..

ABN, Publish Date - Sep 07 , 2024 | 04:20 PM

హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనుమడుతో కలిసి పాల్గొన్నారు. మహా గణపతి పూజ అనంతరం ఆయన మాట్లాడారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కార్యకలాపాలు నిర్వర్తిస్తోందన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా నిర్వహించడం గర్వకారణమన్నారు. 1954 నుంచి 2024 వరకూ దేశం దృష్టిని ఆకర్షించే విధంగా వినాయక చవితిని నిర్వహించడం ఆసక్తికర పరిణామమని సీఎం వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ వినాయకుడు దేశంలో గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు.

1/6

ఖైరతాబాద్​ సప్తముఖ మహాశక్తి గణపతికి శనివారం తొలి పూజ జరిగింది.

2/6

ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అర్చకుడు తికలకం దిద్దుతున్న దృశ్యం.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి..

3/6

ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతికి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి హారతి ఇస్తున్న దృశ్యం..

4/6

సప్తముఖ మహాశక్తి గణపతికి తొలి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనుమడుతో కలిసి పాల్గొన్నారు.

5/6

ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రక్కన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు..

6/6

సప్తముఖ మహాశక్తి గణపతిని తొలి రోజు దర్శించుకునేందుకు పోటెత్తిన భక్త జనం..

Updated Date - Sep 07 , 2024 | 04:20 PM

Advertising
Advertising