హనుమకొండ జిల్లా మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. మామా అల్లుళ్లు కేసీఆర్, హరీశ్‌రావు తోకతెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రారు గానీ.. టీవీ చానల్‌లో మాత్రం నాలుగు గంటలు సొల్లు చెప్పారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఇప్పుడు చచ్చిన పాము లాంటిదని, ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్, నరేంద్రమోదీ తోడు దొంగలని, ఇద్దరూ తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు చెప్పినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.