ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో బారీ వర్షం దృశ్యాలు..

ABN, Publish Date - Jun 18 , 2024 | 09:13 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగళ్లూ పడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల కూకటివేళ్లతో చెట్లు కూలిపోయాయి. అమీర్ పేట, టోలిచౌకి-గోల్కొండ ఎండీ లైన్స్‌లో 200 ఏళ్లనాటి భారీ వృక్షం కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు మధురానగర్‌ డీ-70 బ్లాక్‌లో భారీవృక్షం నేలకూలింది. ఈ ఘటనలో ఓ కారు ముందుభాగం పాక్షికంగా దెబ్బతింది. ఎర్రగడ్డ ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తాయి.

1/6

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సోమవారం కురిసిన భారీ వర్షానికి టోలిచౌకిలో కూలిన 200 ఏళ్ల నాటి వృక్షం..

2/6

దేవరకొండ బస్తీలో ఇళ్లల్లోకి వస్తున్న వరద నీరు..

3/6

అమీర్ పేట‌లోని జలమయమైన సత్యం టీకీస్ రోడ్..

4/6

భారీ వర్షానికి ఖైరతాబాద్, ఆనందనగర్ కాలనీలో కారుపై విరిగిపడ్డ చెట్టు..

5/6

బండారు బాల్‌రెడ్డినగర్‌లో వరద ఉధృతి...

6/6

భారీ వర్షానికి మధురానగర్ డి-బ్లాక్‌లో రహదారికి అడ్డంగా కారుపై నేలకొరిగిన భారీ వృక్షం..

Updated Date - Jun 18 , 2024 | 09:13 AM

Advertising
Advertising