Rain Alert: హుస్నాబాద్‌లో భారీ వర్షాలు
ABN, Publish Date - Sep 04 , 2024 | 12:25 PM
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎల్లమ్మ చెరువు . కొత్తచెరువు మత్తడి దూకుతోంది. హుస్నాబాద్ బస్ స్టాండ్ చెరువును తలపిస్తోంది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మార్కెట్‌యార్డు, నాగారం రోడ్లలో వర్షపు నీరు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి చేరడంతో నివాసితులు అవస్తలుపడుతున్నారు.
హుస్నాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి చెరువును తలపిస్తున్న టీఎస్ఆర్టీసీ బస్టాండ్.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు..
హుస్నాబాద్ పట్టణంలో జలమయమైన ప్రధాన రహదారులు.. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..
చెరువులను తలపిస్తున్న రోడ్లు.. మోకాల్లోతులో వరద నీరు.. జనాలు బయటకు రాలేని పరిస్థితి..
ఇళ్లల్లోకి చేరిన వరద నీరు.. సురక్షిత ప్రాంతానికి తరలిన నివాసితులు..
హుస్నాబాద్ పట్టణంలో మత్తడి దూకుతున్న ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు..
హుస్నాబాద్ పట్టణంలో రోడ్డు ప్రక్కన షాపుల్లోకి చేరిన వరద నీరు..
Updated Date - Sep 04 , 2024 | 12:25 PM