హైదరాబాద్: మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బస్తీలు, కాలనీలలోకి వరద, మురుగునీరు చేరుతోంది. కొన్ని చోట్ల ఇళ్లలోని గదుల్లో వర్షం నీరు నిలిచింది. వరదనీరు రోడ్లను ముంచేయడంతో వాహనాలు ముందుకు కదలడంలేదు. ఈదురుగాలులకు పలుప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లేక చీకట్లు కమ్ముకున్నాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. మంగళవారు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 6 గంటల వరకు కుండపోతగా వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు నిలిచే ఉంది. కొన్ని బస్తీలు నీటి ముంపులోనే ఉన్నాయి. దీంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.