Telangana Talli Statue: ధూంధాంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
ABN , Publish Date - Dec 10 , 2024 | 07:31 AM
తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ కార్యక్రమం ఉద్విగ్న భరితమైన వాతావరణంలో జరిగింది. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు.. హుస్సేన్ సాగర తీరాన.. రాష్ట్ర సచివాలయంలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది.
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ప్రజాపాల విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
వేలమంది మహిళల మధ్య, వేద మంత్రోచ్ఛరణల నడుమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వేదికపై ప్రదర్శించిన పేరణి నృత్యం, భరత నాట్యం, జయజయహే, ప్రజాపాలన, తెలంగాణ అభివృద్థి సంక్షేమ గీతాలు అలరించాయి.
డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను, ‘తెలంగాణ రైజింగ్’ లోగోను కూడా ప్రదర్శించారు.
విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది సర్కార్. సంగీత కచేరీలతో పాటు, కళాకారులు ఆటపాటలతో అందరినీ అలంరించాయి.
ఐమాక్స్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ఎస్ ఎస్ థమన్‌తో 7 గంటల నుంచి 8.30 గంటల వరకు సంగీత కచేరీ జరిగింది.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఫౌంటెయిన్ కూడా నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
కళాకారులు పాడిన పాటలు వేశేషంగా ఆకట్టుకున్నాయి.
Updated Date - Dec 19 , 2024 | 11:45 AM