రాత్రి సమయంలో చేసే ఈ తప్పుల వల్ల ఈజీగా బరువు పెరుగుతారు..!
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:08 PM
అధిక బరువు చాలామందికి ప్రధాన సమస్యగా ఉంది. అధిక బరువు వల్ల మధుమేహం, ఫ్యాటీ లివర్, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్త పడటం మంచిది. చాలా మంది రాత్రి సమయంలో ఆహారం తీసుకునేటప్పుడు చేసే కొన్ని తప్పిదాల కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా, వ్యాయామం చేసినా కొందరు బరువు పెరుగుతూ ఉంటారు. బరువు పెరగడానికి రాత్రి పూట చేసే కొన్ని తప్పులే కారణం..
భోజనం తరువాత కాఫీ..
భోజనం తరువాత కాఫీ తాగడం చాలామంది అలవాటుగా ఉంటుంది. ఇది నిద్ర మీద చాలా ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమికి కారణం అవుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. కాఫీ లో ఉండే కెఫిన్, చక్కెర కూడా బరువు పెరగడానికి దారి తీస్తాయి.
గ్రీన్ టీ..
భోజనం తరువాత గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని కొందరు అనుకుంటారు. కానీ రాత్రి భోజనం తరువాత గ్రీన్ టీ తాగితే బరువు పెరుగుతారు. ఇది జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలను గ్రహించకుండా చేస్తుంది.
నీరు..
భోజనం చేసిన వెంటనే నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారు. భోజనం చేసిన తరువాత నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచ బడతాయి. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. శరీరంలో కొవ్వులు పేరుకుపోతాయి.
వ్యాయామం..
వ్యాయామం బరువు తగ్గడానికి, శరీరం ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది. కానీ రాత్రి భోజనం తరువాత వ్యాయామం చేస్తే అది బరువు పెరగడానికి కారణం అవుతుంది.
Updated Date - Sep 10 , 2024 | 03:08 PM