Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ బిగ్ షాట్.. ఇదిగో హింట్..!
ABN, Publish Date - Jun 23 , 2024 | 10:12 PM
తెలంగాణ రాజకీయ సమీకరణలు ఊహించని రీతిలో మారిపోతున్నాయ్..! కర్ణాటకలో ఏ క్షణాన కాంగ్రెస్ గెలిచిందో ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకోవడమే కాదు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి..!
తెలంగాణ రాజకీయ సమీకరణలు ఊహించని రీతిలో మారిపోతున్నాయ్..! కర్ణాటకలో ఏ క్షణాన కాంగ్రెస్ గెలిచిందో ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకోవడమే కాదు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి..! ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన బీఆర్ఎస్.. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకుందామని ప్రయత్నించి జీరో అయ్యింది..! దీంతో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుందామని హైకమాండ్ చేస్తున్న భగీరథ ప్రయత్నాలన్నీ ఫలించలేదు. ఇప్పటికే నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కారు దిగి.. కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు క్యూలో ఉన్నారు. తక్కువలో తక్కువ సగం మంది బీఆర్ఎస్‌ను వీడుతారని ఓ వైపు.. అబ్బే ఆఖరికి ఆ నలుగురు మాత్రమే మిగులుతారని మరోవైపు వార్తలు గుప్పుమంటున్నాయ్. ఈ వరుస పరిణామాలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ‘Congress For Telangana’ ట్విట్టర్ పేజీలో సంచలన ట్వీట్ చేసింది. ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై సదరు ఎమ్మెల్యే స్పందించి.. ఖండించినప్పటికీ తాజా ట్వీట్‌తో మరోసారి సంచలనమైంది.
జగన్ నివాసం వద్ద రెండో రోజూ రచ్చ
ఇంతకీ ఎవరబ్బా..?
ఆ బిగ్ షాట్ మరెవరో కాదండోయ్.. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఆయనే అని ఎందుకంత కచ్చితంగా చెప్పాల్సి వస్తోందంటే.. క్లారిటీగా చూద్దాం రండి. Big BreaKing.. 4 Term 'M'LA" , Ex- MinisteR" బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతున్నారని.. త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారన్నదే ఆ ట్వీ్ట్ సారాంశం. కాస్త నిశితంగా గమనిస్తే.. Big BreaKingలో K, 4 Term 'M'LA" లో M, LA, Ex- MinisteRలో R పెద్ద అక్షరాలతో ట్వీట్ చేసింది. త్వరలో పార్టీలో ఎవరు చేరబోతున్నారన్నది ఇలా హింట్ ఇచ్చింది కాంగ్రెస్. ఈ హింట్‌ను పరిశీలిస్తే.. KMLAR వస్తుంది.. అంటే గంగుల కమలాకర్ అని క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు గంగుల పొలిటికల్ హిస్టరీ చూస్తే.. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా 2009, 2014, 2018, 2023లో వరుసగా నాలుగు సార్లు గెలిచారు. ఇక 2018లో కమలాకర్ మంత్రిగా కూడా పనిచేశారు. సో.. కాంగ్రెస్ చేసిన ట్వీట్ సారాంశం ఇదే. ఈ ట్వీట్‌కు వందల సంఖ్యలో కామెంట్స్ రాగా.. ఎవరి నోట చూసినా కమలాకర్ అనే మాటే వస్తోంది. మరోవైపు.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కమలాకర్‌తో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!
పాతమిత్రులే..!
గ్రానైట్ వ్యాపారవేత్తగా పేరుగాంచిన గంగుల టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2000లోనే రాజకీయాల్లోకి వచ్చిన కమలాకర్ కరీంనగర్ కార్పొరేటర్‌గా గెలిచి.. మున్సిపాలిటిలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. 2006 - 2007 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేసి.. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా తొలిసారి పోటీచేసి ఘన విజయం సాధించారు. ఉద్యమం సమయంలో టీడీపీ రాజీనామా చేసి 2013లో టీఆర్ఎస్‌లో చేరారు. 2014లో టికెట్ దక్కించుకుని బీజేపీ తరఫున పోటీచేసిన బండి సంజయ్‌పై 24వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లోనూ 14వేల ఓట్ల మెజార్టీతో ఇదే బండిపై గెలిచారు. ఇక ఇదే టర్మ్‌లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలను కేసీఆర్ కేటాయించారు. ఇక 2023 ఎన్నికల్లోనూ బండిపై గుంగులే గెలిచారు. అయితే.. ఈసారి మాత్రం భారీగా మెజార్టీ తగ్గిపోయింది. 3,163 ఓట్లతో మాత్రమే గట్టెక్కారు గంగుల. అంటే.. బండిపై హ్యాట్రిక్ కొట్టారన్న మాట. ఇక అభిమానులు మాత్రం గంగులను ‘కరీంనగర్ భీముడు’ గా అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. కాగా.. కమలాకర్ టీడీపీలో ఉన్నన్ని రోజులు రేవంత్‌తో కలిసే పనిచేశారు. ఈ ఇద్దరూ పాత్రమిత్రేలే..!
వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే
కమలాకరే ఎందుకు..?
కరీంనగర్ బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. వాస్తవానికి జిల్లాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత, జిల్లాలో అన్నీ తానై చూసుకుంటున్నారు కమలాకర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. కారు పార్టీలో ఈయనొక బిగ్ షాట్..! పైగా.. కరీంనగర్ అసెంబ్లీ స్థానాన్ని, పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పెద్దలు జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్‌ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేదు అనుభవం పునరావృతం కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీ వర్గాల్లో గట్టిపట్టున్న కమలాకర్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. ఆయన్ను చేర్చుకునే ప్రతిపాదనను ఆచరణలో పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించారని సమాచారం. జిల్లాలో కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్‌లో ఇప్పటికే ముగ్గురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు బీజేపీలోకి వెళ్లారు. రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌కు చెందిన మేయర్ సునీల్‌రావు ఆ వెనువెంటనే మరో నలుగురు కార్పొరేటర్లు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కలువడంతో వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. కమలాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను, ఇతర ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని, జిల్లాలో తిరుగులేని శక్తిగా మారాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ నుంచి ముఖ్యనేతలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరడం ఆ పార్టీశ్రేణుల్లో కలవరం కలిగిస్తున్నది.
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే
ఇప్పటికే ఖండించిన గంగుల!
గత రెండ్రోజులుగా వస్తున్న ఈ వార్తలపై స్పందించాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంప్రదించగా.. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకే రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొంతకాలం బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం చేసి, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు చెబుతున్నారని అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సోమవారమే కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే, తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని ఆయన తెలిపారు. పది రోజుల పాటు తన విదేశీ పర్యటన ఉంటుందన్నారు.
పవన్ కల్యాణ్ సీరియస్.. నీళ్లు నమిలిన అధికారులు!
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 23 , 2024 | 10:41 PM