ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: ఏపీలో ఇదేం విచిత్రం.. గ్లాస్ గుర్తు ఒక్కటే.. అభ్యర్థులు ఎందరో..!?

ABN, Publish Date - Apr 29 , 2024 | 09:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections 2024) ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) పార్టీల్లో టికెట్లు దక్కని ఆశావహులు పలుచోట్ల రెబల్స్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నేతలతో కూటమికి పెద్ద తలనొప్పే వచ్చిపడింది. అదెలాగంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections 2024) ముందు చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) పార్టీల్లో టికెట్లు దక్కని ఆశావహులు పలుచోట్ల రెబల్స్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నేతలతో కూటమికి పెద్ద తలనొప్పే వచ్చిపడింది. అదెలాగంటే.. కూటమిలో భాగంగా జనసేనకు దక్కిన 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేస్తోంది. ఇదివరకటి లాగా తమకు గాజు గ్లాస్ గుర్తే కావాలని ఎన్నికల కమిషన్‌ను కోరడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. ప్రచారం కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. సో.. ఇప్పటి వరకూ అంతా ప్రశాంతంగా ఉన్నా నామినేషన్ల విత్ డ్రా గడవు ముగిసిన రోజే పెద్ద గండమే వచ్చిపడింది. గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ కావడంతో పదుల సంఖ్యలో అభ్యర్థులకు ఇదే గుర్తు ఇచ్చేయడం గమనార్హం.


ఈసీ.. ఇదేంటి..?

గాజు గ్లాస్ గుర్తు మరెవరికీ కేటాయించొద్దని కూటమి నేతలు పదే పదే ఈసీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు అబ్బే.. ఎవరికీ కేటాయించే పరిస్థితి లేదన్న ఎన్నికల సంఘం.. ఒక్కరోజు గ్యాప్‌లోనే నామినేషన్ల విత్ డ్రా ముగిసిన నిమిషాల వ్యవధిలోనే రెబల్స్, ఇండిపెండెంట్లకు ఇవ్వడం విచిత్రంగా ఉంది. దీంతో కూటమి నేతలు మరోసారి కోర్టులు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇదంతా జగన్ ఆడుతున్న జగన్నాటకం అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కుట్ర చేస్తున్నారని.. లేకుంటే ఇదెలా సాధ్యమంటూ ఆరోపణలు చేస్తున్నారు నేతలు. ఎన్నిలకు ముందు చేతులెత్తేసిన జగన్ ఇలా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. కూటమి నేతలు పోటీచేస్తున్న చోట అదే పేరుతో ఉండే అభ్యర్థులను సైతం బరిలోకి దింపడం మరో దారుణమైన విషయమని తెలుగు తమ్ముళ్లు కన్నెర్రజేస్తున్నారు.


ఎవరెవరికి గుర్తు..?

  • విజయనగరం మాజీ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్‌ అభ్యర్థి మీసాల గీత

  • మైలవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్

  • విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్

  • టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్

  • కాకినాడ జిల్లా.. జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర

  • పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్ బాబు

  • గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణ

  • అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీ చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప

  • మంగళగిరిలో రావుసుబ్రహ్మణ్యం

  • మదనపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్‌లకు ఆయా నియోజకవర్గాల ఆర్వోలు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం జరిగింది.

మరిన్ని ఏపీ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 29 , 2024 | 09:44 PM

Advertising
Advertising