ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: టికెట్ ఇచ్చినా నియోజకవర్గం వైపు తొంగిచూడని వైసీపీ అభ్యర్థి.. వైఎస్ జగన్‌కు హ్యాండిచ్చేసినట్టేనా..?

ABN, Publish Date - Feb 27 , 2024 | 12:01 PM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో ఏం జరుగుతోందో అధిష్టానానికే తెలియని పరిస్థితి. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 7 విడతలుగా 66 మందికి పైగా దాదాపు అభ్యర్థులను జగన్ ప్రకటించారు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో ఏం జరుగుతోందో అధిష్టానానికే తెలియని పరిస్థితి. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 7 విడతలుగా 66 మందికి పైగా దాదాపు అభ్యర్థులను జగన్ ప్రకటించారు. అయితే ఇందులో ఇప్పటికే పలువురు కొత్త నియోజకవర్గాలకు అభ్యర్థులు ముఖం చాటేయగా.. మరికొందరు అసలు పోటీ చేయాలా..? వద్దా..? అనే డైలామాలో ఉన్నారు. వీటన్నింటికీ కారణం ఇటీవల వచ్చిన ప్రముఖ సంస్థలు విడుదల చేసిన సంచలన సర్వేలే..


ఇదీ అసలు కథ..!

అవనిగడ్డ నియోజకవర్గానికి సమన్వయకర్తగా డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ను నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుని నెలరోజులు దాటుతున్నా ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవటంతో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబును మచిలీపట్నం పార్లమెంట్‌ నుంచి పోటీ చేయించాలని ఆలోచనతో వైసీపీ అధిష్ఠానం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. అవనిగడ్డ నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్యనారాయణరావు కుమారుడు, కేన్సర్‌ వైద్యనిపుణుడు చంద్రశేఖర్‌రావును నియమిస్తూ గతనెలలో నిర్ణయం తీసుకుంది. అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలిసిన డాక్టర్‌ చంద్రశేఖర్‌ తాను ఈ వయస్సులో పోటీ చేయలేనని, తనకు బదులుగా తన కుమారుడు, న్యాయవాది రామ్‌చరణ్‌ను సమన్వయకర్తగా నియమించాలని కోరారు. దీనికి జగన్మోహన్‌రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించటంతో రామ్‌చరణ్‌ వైసీపీ సమన్వయకర్తగా ఉంటారని, ఆయనను కూడా ఆదరించాలని చంద్రశేఖర్‌ విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజుల్లోనే అవనిగడ్డ నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పిన చంద్రశేఖర్‌ మళ్లీ ఆవైపు చూడకపోవటంతో ఏం జరిగిందో అర్థంకాక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.

స్థానిక నాయకత్వం తీరుతో వెనక్కి తగ్గారా..?

స్థానిక నేతలను కలిశాక పార్టీ కార్యకలాపాలు సాగించాలనే భావనతో జనవరి చివరి వారంలో చంద్రశేఖర్‌ అవనిగడ్డకు వచ్చారు. స్థానిక నేతలెవరూ కనీసం ఫోన్‌కు కూడా స్పందించలేదు. దీంతో సహాయ నిరాకరణ చేస్తున్నారన్న ఆవేదనతో డాక్టర్‌ చంద్రశేఖర్‌ తన కుమారుడిని అవనిగడ్డలో నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనను విరమించుకున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు..?

అవనిగడ్డ సమన్వయకర్తగా నియమితులైన డాక్టర్‌ చంద్రశేఖర్‌ వెనక్కి తగ్గటంతో ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారన్న విషయమై స్పష్టత లేక కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్‌బాబే మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారం సాగిస్తున్నారు. దీనికితోడు 10 రోజుల క్రితం ఓ వివాహ కార్యక్రమానికి జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్లిన సింహాద్రి రమేష్‌బాబు వెళ్లగా, మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని సీఎం సూచించినట్టు కూడా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

కొత్త నేత కోసం వెతుకులాట..?

మంచి పట్టున్న డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ సమన్వయకర్తగా నియమితులైన తర్వాత ఒక్కసారి కూడా నియోజకవర్గంలోని క్యాడర్‌ను కలవకపోవటంతో వైసీపీ అధిష్ఠానం మరో కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలన్న భావనలో ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. ద్వితీయ శ్రేణి నేతలను గానీ, కొత్త నేతలను గానీ రంగంలోకి దింపితే వారిపై వ్యతిరేకత రాకుండా ఉంటుందన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - Mar 03 , 2024 | 01:03 PM

Advertising
Advertising