Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!
ABN, Publish Date - Mar 11 , 2024 | 02:18 PM
AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
YS Jagan: ‘సిద్ధం’ చివరి సభలో జగన్ ప్రసంగం.. కంగుతిన్న వైసీపీ!
ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..!
ఆ సీనియర్ ఎమ్మెల్యే మరెవరో కాదు.. గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ (Varaprasad Rao). గూడూరు వైసీపీ టికెట్ మేరుగ మురళీకి అధిష్టానం కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వరప్రసాద్ ఎమ్మెల్యేగా పోటీచేయాల్సిందేనని భావించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి పార్టీ కండువా కప్పుకోవాలని చూశారు కానీ.. ఎందుకో ఇది వర్కవుట్ కాలేదు. సీన్ కట్ చేస్తే.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వరప్రసాద్ ప్రత్యక్షమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తనకు గూడురు టికెట్ కేటాయిస్తే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పినట్లు తెలియవచ్చింది. నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో మాట్లాడిన త్వరలోనే బీజేపీలో చేరికపై ముహూర్తం చేసుకుంటారని తెలుస్తోంది.
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
అటు కసరత్తు.. ఇటు చేరికలు!
మరోవైపు.. కేంద్రం నుంచి బీజేపీ అగ్రనేతలు రెండ్రోజులుగా ఏపీలోనే మకాం వేశారు. టీడీపీ-జనసేన-బీజేపీలో (TDP-Janasena-BJP) కూటమి అభ్యర్థులపై తీవ్ర కసరత్తే జరుగుతోంది. ఆదివారం నాడు పవన్ కల్యాణ్‌తో.. సోమవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి షెకావత్ బృందం సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. ఇవాళ సాయంత్రంలోపు అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో వరప్రసాద్ బీజేపీ కార్యాలయానికి వెళ్లి.. పురంధేశ్వరితో భేటీ అయ్యారు. ఇది ఒకింత ఊహించని ట్విస్ట్.. అంతకుమించి వైసీపీ పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. వరప్రసాద్ చేరిక ఎప్పుడు ఉంటుందో.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 11 , 2024 | 02:22 PM