ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని షాక్..

ABN, Publish Date - May 09 , 2024 | 05:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) ముందు కూడా అధికార వైసీపీకి (YSR Congress) షాకులు తప్పట్లేదు. ఇప్పటికే టికెట్లు దక్కని.. ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) ముందు కూడా అధికార వైసీపీకి (YSR Congress) షాకులు తప్పట్లేదు. ఇప్పటికే టికెట్లు దక్కని.. ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కీలక నేత బుట్టా రంగయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మిగనూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన రంగయ్య.. సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడంతో జిల్లా పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పార్టీలో పనిచేసే వాతావరణం లేకపోవడం, సీనియర్ల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. గతంలో ఎమ్మిగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌గా కూడా రంగయ్య పనిచేశారు. మున్సిపల్ చైర్మన్‌గా, పట్టణ అధ్యక్షుడిగా పనిచేసి మంచి పరిచయాలున్న నేత రాజీనామా చేయడం నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దెబ్బేనని స్థానికులు చెప్పుకుంటున్న పరిస్థితి.


బుట్టా రేణుకకు షాక్!

ఎమ్మిగనూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బుట్టా రేణుక (Butta Renuka) సమీప బంధువే బుట్టా రంగయ్య. అసలే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డిని మార్చి రేణుకకు టికెట్ ఇవ్వడంతో ఇక్కడ వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో అంతంత మాత్రమే ఉన్న వైసీపీకి ఇలా రంగయ్య కూడా రాజీనామా చేయడం.. అది కూడా ఎన్నికల ముందు ఇలా జరగడంతో బిగ్ షాకేనని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. రాజీనామా చేశారు సరే.. ఏ పార్టీలో చేరుతారు..? అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మరోవైపు.. రంగయ్యను బుజ్జగించేందుకు జిల్లా ముఖ్యనేతలు రంగంలోకి దిగినప్పటికీ ససేమీరా అంటున్నట్లుగా తెలిసింది. ఈ వరుస పరిణామాలను బట్టి చూస్తుంటే కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బీవీ నాగేశ్వరరెడ్డి గెలుపు పక్కా అని ఎమ్మిగనూరులో చర్చ జరుగుతోంది.

Read Latest AP News And Telugu News


Updated Date - May 09 , 2024 | 05:15 PM

Advertising
Advertising