ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీలో విబేధాలు.. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి బాగా కలిసొచ్చే ఏకైక నియోజకవర్గం ఇదే..!!

ABN, Publish Date - Apr 21 , 2024 | 10:49 AM

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట (Rajampeta) నియోజకవర్గంలో పెద్ద హాట్‌ టాపిక్‌గా ఉన్న రాజకీయ అంశం మేడా, ఆకేపాటి అన్నదమ్ముల (Meda, Akepati Brothers) అలకపాన్పు అంశం. వైసీపీలో ప్రధానమైన ఇరువురు నాయకులు జడ్పీ చైర్మన్‌, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, మరో కీలక నాయకుడు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ఈ ఇరువురు నాయకులకు ప్రధానమైన సోదరులు ఇరువురు ఉన్నారు. వీరి అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది...

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట (Rajampeta) నియోజకవర్గంలో పెద్ద హాట్‌ టాపిక్‌గా ఉన్న రాజకీయ అంశం మేడా, ఆకేపాటి అన్నదమ్ముల (Meda, Akepati Brothers) అలకపాన్పు అంశం. వైసీపీలో ప్రధానమైన ఇరువురు నాయకులు జడ్పీ చైర్మన్‌, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, మరో కీలక నాయకుడు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ఈ ఇరువురు నాయకులకు ప్రధానమైన సోదరులు ఇరువురు ఉన్నారు. వీరి అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇది టీడీపీకి (Telugu Desam) బాగా కలిసివచ్చే అంశం. ఇప్పటికే వైసీపీ ప్రధాన నాయకులంతా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ అంశం ఎక్కడ చూసినా ప్రధాన అంశంగా మారింది.


చకచకా పూర్తి చేశారు కానీ..!!

ముందుగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి విషయానికి వస్తే ఆయనకు ఎమ్మెల్యే టికెట్టు దక్కలేదు. ఆయన సోదరుడు క్లాస్‌వన్‌ కాంట్రాక్టర్‌ మేడా రఘునాధరెడ్డి.. ఈయనకు ఇటీవలే వైసీపీ రాజ్యసభ పదవిని కట్టబెట్టి మల్లికార్జునరెడ్డికి ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వకుండా మొండి చేయి చూపింది. చేసేది లేక ఆయన తన తమ్ముడికి రాజ్యసభ స్థానం ఖరారయ్యే వరకు ఒకటి రెండు వైసీపీ సమావేశాల్లో పాల్గొని తూతూమంత్రంగా సమావేశంలో ప్రసంగించారు. తన తమ్ముడికి రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ఆ పార్టీలోనే ఉంటూ తాను చేయాల్సిన పనిని చకచకా పూర్తి చేశారు. ముచ్చటగా మూడు సార్లు నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రధాన నాయకులను, సర్పంచ్‌లను, ఎంపీటీసీలను, కౌన్సిలర్లను తన మాజీ వర్గీయుడైన మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ పోలి సుబ్బారెడ్డి నేతృత్వంలో టీడీపీలో చేర్పించి తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఆకేపాటి అమర్‌నాధరెడ్డిపై, వైసీపీపై తన అక్కసును తీర్చుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జునరెడ్డి వైసీపీ ప్రచార కార్యక్రమాలకు, అమర్‌నాధరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి కూడా రాకుండా ఎంచక్కా తన వ్యాపార కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. రాజ్యసభ సభ్యుడైన రఘునాథరెడ్డి తన అన్న మల్లికార్జునరెడ్డి నిర్వహిస్తున్న వ్యవహారాలను చూడడం తప్ప అడ్డగించుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు.


అలకపాన్పుపై ఆకేపాటి మురళీ

ఇంకో ప్రధాన విషయం ఆకేపాటి అన్నదమ్ములది. ప్రస్తుతం ఆకేపాటి అమర్‌నాధరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం జడ్పీ చైర్మన్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అమర్‌నాధరెడ్డి చిన్నాన్న ఆకేపాటి గోపాల్‌రెడ్డి కుమారుడైన శ్రీనివాసులరెడ్డి (మురళీ) అలక పాన్పుపై పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. నియోజకవర్గంలో ఆకేపాటి గోపాల్‌రెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయన అమర్‌నాధరెడ్డికి స్వయాన చిన్నాన్న. గోపాల్‌రెడ్డి గతంలో టీడీపీ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఆయన మరణం తరువాత ఆయన కుమారుడు శ్రీనివాసులరెడ్డి, ఆకేపాటి రంగారెడ్డి (మండల ఉపాధ్యక్షుడు) రాజకీయం నిర్వహిస్తున్నారు. శ్రీనివాసులరెడ్డికి తమ తండ్రి హయాం నుంచి బలమైన అనుచరగణం ఉంది. రాజంపేట, సుండుపల్లి మండలాలతో పాటు ఆకేపాడు చుట్టుపక్కల ఏడు గ్రామాలపై వీరి ఆధిపత్యం నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తోంది. ఒక దశలో శ్రీనివాసులరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు లభిస్తుందని అందరూ అనుకున్నారు.

టీడీపీకి ప్లస్!

ఇంతలో టికెట్టు సుగవాసి బాలసుబ్రమణ్యంకు దక్కింది. ఆ విషయం అటుంచితే... వైసీపీ ఐదేళ్ల హయాంలో తమకు ఎటువంటి సముచిత స్థానం ఇవ్వలేదని, అటు ఎమ్మెల్యే, ఎంపీలు తమకు ప్రాధాన్యత కల్పించలేదని, ఇత్యాది కారణాలతో తన అన్న అమర్‌నాధరెడ్డికి టికెట్టు ఇచ్చినా.. ఆయన వెంట తమ్ముడు శ్రీనివాసులరెడ్డి నడవలేదు. అదే సమయంలో ఆయన రాజంపేటలో ఉంటున్నా వైసీపీ నాయకులతో కలిసి ప్రచారాలకూ వెళ్లలేదు. ఈ సమయంలో ఇటీవల తన తండ్రి గోపాల్‌రెడ్డికి ప్రీతిపాత్రుడైన మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం అంతర్గతంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. అవి ఏ మేరకు ఫలించాయనేది అటుంచితే శ్రీనివాసులరెడ్డి అలకపాన్పుపై ఉండటం వైసీపీకి శాపం కాగా, టీడీపీకి బాగా కలిసివచ్చే అంశమని పలువురు చర్చించుకుంటున్నారు. కావున ప్రస్తుత తరుణంలో మేడా, ఇటు ఆకేపాటి అన్నదమ్ముల అలకపాన్పు అంశం నియోజకవర్గంలో పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ గులకరాయి కేసు: వేముల దుర్గారావు అరెస్టు.. విడుదల..

ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 10:55 AM

Advertising
Advertising