ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: తెలంగాణలో వచ్చేది బీజేపీనే.. సీఎం నేనే..!!

ABN, Publish Date - Mar 10 , 2024 | 10:22 PM

Katepally Ramana Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు (TS Politics) రోజురోజుకూ మారిపోతున్నాయ్.! వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా తయారయ్యిందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.! ఎంపీలు అందరూ కమలం పార్టీలో చేరుతుండగా.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు..

తెలంగాణలో రాజకీయ పరిణామాలు (TS Politics) రోజురోజుకూ మారిపోతున్నాయ్.! వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా తయారయ్యిందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.! ఎంపీలు అందరూ కమలం పార్టీలో చేరుతుండగా.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో అటు బీజేపీ సిట్టింగులు.. ఇటు కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్‌లో బీఆర్ఎస్‌పై మాటల యుద్ధం చేస్తున్నారు. ఇది కాస్త ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Katipally VenkataRamana Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పనిలో పనిగా తన మనసులోని మాటలన్నింటినీ ఒక్కసారిగా కక్కేశారు.

YS Jagan: ‘సిద్ధం’ చివరి సభలో జగన్ ప్రసంగం.. కంగుతిన్న వైసీపీ!



అసలేం జరిగింది..?

గత కొన్నిరోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రొటోకాల్ రగడ నడుస్తోంది. ఇది చినికి చినికి గాలి వానలా మారి.. సిట్టింగ్ ఎమ్మెల్యే కేవీ మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి. ‘ రేపొద్దున తెలంగాణకు నేను ముఖ్యమంత్రిని అవుతా. నా గర్ల్‌ఫ్రెండ్‌కు కూడా కేబినెట్ హోదా ఇస్తా.. అట్ల ఇయ్యొచ్చా..?. అలా ఇయ్యొచ్చు అంటే నేను కూడా తయారు చేసుకుంటాను. నేను కూడా 2028కి ప్లాన్‌లో ఉన్నా.. సీఎం అవుతాను కూడా. విడిచిపెట్టేది అయితే లేదు. అవును.. మీడియాకే చెబుతున్నాను డైరెక్టుగా. ఇది నా ఛాలెంజ్. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎలా అన్నానో.. 2028 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం కూడా చూపెట్టను. పత్రికా ముఖంగా చెబుతున్నాను.. 2028లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది’ అని బీజేపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు కామారెడ్డిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకీ సార్ చెబుతున్న ఆ గర్ల్‌ఫ్రెండ్ ఎవరబ్బా అని సోషల్ మీడియా ఈ వీడియోపై నెటిజన్లు నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

YS Jagan: జగనన్నా ఏంటిది.. ఇంకెన్ని సార్లు ఇలా.. విస్తుపోతున్న వైసీపీ శ్రేణులు!

ఈ మాటల వెనుక..?

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించట్లేదని కొన్నిరోజులుగా కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చారా..? అంటూ మీడియా ముందుకు వచ్చి కాటిపల్లి కన్నెర్రజేస్తున్నారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం షబ్బీర్ అలీ పేరును శిలాఫలకంపై వేయిస్తారని.. ఏ హోదాతో ప్రారంభోత్సవాలు చేయిస్తారని అధికారులను ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డిని.. షబ్బీర్ అలీకి ఇచ్చిన పదవిని తప్పుబడుతూ ఎమ్మెల్యే పైవిధంగా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా షబ్బీర్ అలీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి సీఎం అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఇద్దర్నీ ఓడించింది రమణారెడ్డే అనే విషయం తెలిసిందే.

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Updated Date - Mar 10 , 2024 | 10:22 PM

Advertising
Advertising