BRS: కేసీఆర్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. ఏదో ఒకటి తేల్చాలని ఘాటు లేఖ!
ABN, Publish Date - Mar 07 , 2024 | 05:47 PM
Maharastra BRS Leaders: తెలంగాణలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ (BRS).. ఆ తర్వాత స్వరాష్ట్రంలో తప్ప మరెక్కడా యాక్టివ్‌గా లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో.. నేతలు (Maharastra BRS), కార్యకర్తలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నేతలు ఇప్పటికే జంపింగ్‌లు చేస్తున్నారు..
తెలంగాణలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ (BRS).. ఆ తర్వాత స్వరాష్ట్రంలో తప్ప మరెక్కడా యాక్టివ్‌గా లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో.. నేతలు (Maharastra BRS), కార్యకర్తలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నేతలు ఇప్పటికే జంపింగ్‌లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు కారు పార్టీ ఖాళీ అవ్వగా.. ఇక మహారాష్ట్రలో అయితే పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారయ్యింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) మొదట టార్గెట్ చేసింది మహారాష్ట్రనే. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు కన్నెర్రజేస్తున్నారు. అప్పుడెప్పుడో మార్కెట్ కమిటీ ఎన్నికల్లో మాత్రమే పోటీచేసిన బీఆర్ఎస్.. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ పోటీచేసిన పరిస్థితి లేదు. అంతేకాదు.. మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాలకు కూడా అద్దె చెల్లింపులకు ఆపేసింది హైకమాండ్. దీంతో అసలు పార్టీ కార్యకలాపాలు ఉన్నాయా.. లేదా..? అని డైలామాలో ఉన్నారు. మరోవైపు.. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్‌కు మహారాష్ట్ర నేతలు ఘాటు లేఖ రాశారు.
AP Politics: ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఏం చేయబోతున్నారు.. అందరి చూపు ఇటే..!
లేఖలో ఏముంది..?
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పోటీ చేస్తుందో..? లేదో..? తేల్చేయాలని కేసీఆర్‌కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఘాటు ఘాటుగానే లేఖ రాశారు. వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని.. లేనిచో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. గురువారం నాడు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహారాష్ట్రలో పార్టీ నియమించిన ఆరుగురు కోఆర్డినేటర్ల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించి.. కేసీఆర్‌కు లేఖ రాయడం జరిగింది. బీఆర్ఎస్ వైఖరితో రాబోయే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతున్నామని కొందరు.. గులాబీ పార్టీలో చేరి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని లేఖలో గులాబీ నేతలు స్పష్టం చేశారు.
Telangana: సీఎం రేవంత్‌ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ..
ఇంకెప్పుడో..?
మహారాష్ట్రలోని బీఆర్ఎస్ కార్యాలయాలకు అద్దెలు చెల్లించట్లేదని చాలా రోజులుగా నడుస్తున్నదే. కనీసం బీఆర్ఎస్ పెద్దలకు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదన్నది మరో ఆరోపణ. దీనికి తోడు పార్టీ కార్యక్రమాల చేపట్టడానికి నిధులు సైతం ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు పెద్ద సమస్యే వచ్చిపడినట్లయ్యింది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి పలువురు నేతలను బీఆర్ఎస్ చేర్చుకున్నది. నాటి నుంచి కొద్దిరోజులపాటు పార్టీ కార్యకలాపాలు జరిగినప్పటికీ.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలో తాజా పరిణామాలపై చర్చించడానికి కోఆర్టినేటర్లు సమావేశమై ఇలా కేసీఆర్‌కు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖపై బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి ఎలాంటి రిప్లయ్ వెళ్తుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 07 , 2024 | 05:47 PM