ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS Vs Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే.. ‘కారు’కు ఎన్ని కష్టాలో..!?

ABN, Publish Date - Jun 21 , 2024 | 05:44 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ (BRS).. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా నిలదొక్కుకుందామని చేసిన విశ్వప్రయత్నాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! దీంతో కారు పార్టీకి గడ్డు రోజులు మొదలయ్యాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ (BRS).. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా నిలదొక్కుకుందామని చేసిన విశ్వప్రయత్నాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! దీంతో కారు పార్టీకి గడ్డు రోజులు మొదలయ్యాయి. ఇంత జరిగిన తర్వాత ఇక పార్టీలో ఉండటం అవసరమా అనుకుంటున్నారో..? లేకుంటే బీఆర్ఎస్ బతుకుతుందో లేదో అనుకుంటున్నారో అనేది తెలియట్లేదు కానీ ఒక్కొక్కరుగా కారు దిగి అటు కాంగ్రెస్ (Congress).. ఇటు బీజేపీ గూటికి చేరిపోతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. ఇవాళ సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అయితే.. ఈ చేరిక జరిగిన కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగలబోతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో కేసీఆర్‌కు వరుస ఎదురు దెబ్బలు తప్పేలా లేవని.. చివరికి ముగ్గురు, నలుగురు తప్ప ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీలో ఉండే అవకాశాలు కనిపించట్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి.

బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి


ఎవరా ఎమ్మెల్యే..?

తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. గాంధీ భవన్ తలుపులు తెరిచిపెట్టడంతో అటు కారు పార్టీ నుంచి.. ఇటు కాషాయ పెద్ద సంఖ్యలో నేతలు వచ్చి చేరిపోతున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాతే చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడతారని టాక్ నడిచింది. ఇదే విషయాన్ని మంత్రులు పదే పదే మీడియా ముందుకు ప్రస్తావిస్తూ వస్తున్నారు కూడా. అయితే ఆ చేరికలు కాస్త పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్నాయి. పోచారంతో చేరికలు మొదలయ్యాయి. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బండారి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారని వార్తలు వస్తున్నప్పటికీ.. జానా పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లినట్లుగా ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇది కాసేపు అటుంచితే.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా లక్ష్మారెడ్డి భేటీ కావడం.. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నట్లు మరో ఫొటో బయటికి వచ్చింది. దీంతో పక్కాగా బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేస్తారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరిక ఉంటుందని తెలియవచ్చింది.

పవన్ కల్యాణ్ సీరియస్.. నీళ్లు నమిలిన అధికారులు!



ఏరికోరి ఇప్పించారు..!

2023 ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావించిన బండారి లక్ష్మా రెడ్డి టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఓకే అనడంతో టికెట్ దక్కింది. సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఉన్నప్పటికీ ఏరికోరి మరీ బండారికే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. 49,030 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన లక్ష్మారెడ్డి.. పార్టీ అధికారంలోకి రాకపోయే సరికి పక్కచూపులు చూస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కాగా.. టికెట్ రాకపోవడంతో తీవ్ర సఅసంతృప్తికి లోనైన భేతి సుభాష్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఏప్రిల్ నెలలోనే కాషాయ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు గెలిచిన బండారి కూడా కాంగ్రెస్‌లో చేరిపోతున్నారనే వార్తలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడర్ ఎవరున్నారు..? క్యాడర్‌ను చూసుకునేది ఎవరు..? అనేదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ వరుస ఎదురు దెబ్బలతో ఎలా ఉన్న కారు పార్టీ.. ఇలా అయ్యిందేంటి..? ఇన్ని కష్టాలొచ్చాయేంటో..? అని పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందుతున్న పరిస్థితి. మున్ముందు ఇంకా ఎంతమంది బీఆర్ఎస్‌ను వీడుతారో.. ఆఖరికి పార్టీ ఏమవుతుందో అనే అనుమానాలు సైతం గులాబీ నేతల్లో వస్తున్నాయ్..!

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jun 21 , 2024 | 05:48 PM

Advertising
Advertising