మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Big Breaking: బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటన.. ఎన్ని సీట్లు ఇచ్చారంటే..?

ABN, Publish Date - Mar 09 , 2024 | 04:19 PM

AP Elections 2024: అవును.. అనుకున్నట్లే ఎన్డీఏలోకి టీడీపీ చేరిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులు పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ జరిపిన కీలక చర్చలు సక్సెస్ అయ్యాయి. ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటనే చేశారు. పర్యటన అనంతరం టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..? బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నామనే విషయాలపై చర్చించడం జరిగింది.

Big Breaking: బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటన.. ఎన్ని సీట్లు ఇచ్చారంటే..?

అవును.. అనుకున్నట్లే ఎన్డీఏలోకి టీడీపీ (TDP) చేరిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులు పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ జరిపిన కీలక చర్చలు సక్సెస్ అయ్యాయి. ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటనే చేశారు. పర్యటన అనంతరం టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..? బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నామనే విషయాలపై చర్చించడం జరిగింది.

AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్



Pawan-And-Amit-Shah.jpg

రాష్ట్రం కోసమే..!

‘ఎన్డీఎలోకి మనం వెళుతున్నాం.. సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. పొత్తులపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. బీజేపీకి 06 అసెంబ్లీ, 05 లోక్‌సభ సీట్లు ఇచ్చాం. బీజేపీ, జనసేనతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాం. ఐదేళ్లలో ఏపీని వైఎస్ జగన్‌ దివాళా తీయించారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి కేంద్ర సహకారం చాలా అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్.. విభజన హామీలు నెరవేర్చడం, అరాచక పాలనను అంతమొందించడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం. శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాను. సోమవారం మిగతా అభ్యర్దుల జాబితా ప్రకటన ఉండొచ్చు. పార్టీలో టిక్కెట్లు రాని, అసంతృప్తిగా ఉన్న వారిని వెంటనే సీనియర్లు.. పిలిపించి మాట్లాడండి’ అని సీనియర్లు, ముఖ్యనేతలకు చంద్రబాబుకు కీలక సూచనలు చేశారు. కాగా.. పలువురు నేతలతో శుక్రవారం నాడే ఢిల్లీ నుంచి మాట్లాడి.. బాబు బుజ్జగించిన సంగతి తెలిసిందే.

తిరుగుపయనం..!

బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు జరిపిన సుదీర్ఘ చర్చలు సక్సెస్ అయ్యాయి. మూడ్రోజులుగా ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలే చోటుచేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆరేళ్ల తర్వాత ఎన్డీఏలో టీడీపీ చేరుతోంది. 2024లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీచేయబోతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు, వైసీపీని గద్దె దించేందుకే ఈ పొత్తు అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ కూటమికి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరిస్తామని.. బీజేపీ, టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇరువురూ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు. బీజేపీ అగ్రనేతల నుంచే పొత్తుకు సంబంధించి కీలక ప్రకటన ఉండబోతోందని తెలియవచ్చింది. శనివారం అర్ధరాత్రి లోపు పొత్తుపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!

Updated Date - Mar 09 , 2024 | 04:46 PM

Advertising
Advertising