AP Elections: ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామం.. పాడేరు టికెట్ గిడ్డి ఈశ్వరికే ఎందుకు..!?
ABN, Publish Date - Apr 22 , 2024 | 10:03 AM
అనుహ్య పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు తెలుగుదేశం (Telugu Desam).. పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి (Giddi Eswari) ఎమ్మెల్యే టికెట్ దక్కింది. స్థానిక ఎమ్మెల్యే స్థానానికి టికెట్ కోసం గిడ్డి ఈశ్వరితో పాటు పార్టీ సీనియర్ నేతలు కొట్టగుళ్లి సుబ్బారావు, ఎంవీవీ ప్రసాద్ ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకి (BJP) కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ..
అనుహ్య పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు తెలుగుదేశం (Telugu Desam).. పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి (Giddi Eswari) ఎమ్మెల్యే టికెట్ దక్కింది. స్థానిక ఎమ్మెల్యే స్థానానికి టికెట్ కోసం గిడ్డి ఈశ్వరితో పాటు పార్టీ సీనియర్ నేతలు కొట్టగుళ్లి సుబ్బారావు, ఎంవీవీ ప్రసాద్ ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకి (BJP) కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ పలు కారణాలతో అరకులోయ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో పాడేరు స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల పాత పాడేరుకు చెందిన కిల్లు వెంకట రమేశ్‌నాయుడుకు టీడీపీ టికెట్ దక్కింది. దీంతో తనకు అన్యాయం జరిగిందని గిడ్డి ఈశ్వరి ఆవేదన చెందడంతో పాటు నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ సైతం ఆమెకు అండగా నిలిచింది. స్థానిక అసెంబ్లీ అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టానం పునరాలోచన చేయాలనే డిమాండ్ పెరిగింది. దీంతో స్థానిక నియోజకవర్గంలోని తాజా పరిస్థితులు, టికెట్ పొందిన రమేశ్‌నాయుడు, గిడ్డి ఈశ్వరిల వ్యవహార శైలిపై సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో పరిస్థితులు గిడ్డి ఈశ్వరికి అనుకూలంగా ఉండడంతో పాటు ఆమె గత ఆరున్నరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేశారని అధిష్ఠానం గుర్తించింది. దీంతో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. ఆదివారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. గిడ్డి ఈశ్వరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫారం అందించారు.
నేడు నామినేషన్
టీడీపీ పాడేరు అసెంబ్లీ స్థానం అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ., టీడీపీ, జనసేన నేతలు, అధిక సంఖ్యలో కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు బీజేపీ, జనసేన శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని గిడ్డి ఈశ్వరి కోరారు.
కష్టానికి దక్కిన ఫలితం..
గిరిజనుల పక్షపాతిగా ఉండే తెలుగుదేశం పార్టీ త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సైతం గిరిజనులకు పెద్దపీట వేసింది. అరకులోయ పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలుండగా పార్వతీపురం ఎస్‌సీ రిజర్వుడు కాగా మిలిగిన రంపచోడవరం, పాడేరు, అరకులోయ, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఎస్‌టీ రిజర్వుడు. అయితే వాటిలో అరకులోయ స్థానాన్ని బీజేపీకి, పాలకొండ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, మిగిలిన ఐదు స్థానాల్లో ఎస్‌టీ రిజర్వుడుగా వున్న రంపచోడవరంలో మిరియాల శిరీషా, పాడేరులో గిడ్డి ఈశ్వరి, కురుపాంలో తొయ్యాక జగదీశ్వరి, సాలూరులో గుమ్మడి సంధ్యారాణిలను ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. పార్వతీపురంలో బోనెల విజయ్‌ను నిలబెట్టారు. ఒక పార్లమెంట్ స్థానం పరిధిలో టీడీపీకి కేటాయించిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు స్థానాల్లోనూ గిరిజన మహిళలకే అవకాశం కల్పించడంపై గిరిజన మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. అభ్యర్థులందరికీ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో బీ ఫారాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గిరిజనులు, గిరిజన మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే ఒక ఉదాహరణ గా పేర్కొనవచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబునాయుడుకి రుణపడి ఉంటామని బీఫారం పొందిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు.
గిడ్డి ఈశ్వరికి టికెట్‌పై నేతల హర్షం
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి దక్కడంపై ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు టికెట్ ప్రకటించి బీ ఫారం ఇచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. టీడీపీ నేతలు గంగపూజారి శివకుమార్, డప్పోడి వెంకటరమణ, కేవీ.సురేశ్‌కుమార్, జి.సింహాచలం, కూడి రామునాయుడు, కొట్టగుళ్లి రమేశ్‌నాయుడు, జ్యోతికిరణ్, బుక్కా జగదీశ్ తదితరులు ఆమెకు టికెట్ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
గెలిపించుకుంటాం..
గిడ్డి ఈశ్వరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని టీడీపీ మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎంతో నమ్మకంతో గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ కేటాయించారని, అతని నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. పాడేరు నియోజకవర్గంలో టీడీపీకి, గిడ్డి ఈశ్వరికి మంచి క్యాడర్ ఉందన్నారు. ప్రజలు కోరుకున్నట్టు ఈశ్వరి టికెట్ కేటాయించడంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈశ్వరిని గెలిపించుకుని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామన్నారు. పాడేరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగుతుందని, ప్రజలంతా గిడ్డి ఈశ్వరి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనందరావు, ఎల్.నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 22 , 2024 | 10:08 AM