YS Jagan: జగనన్నా ఏంటిది.. ఇంకెన్ని సార్లు ఇలా.. విస్తుపోతున్న వైసీపీ శ్రేణులు!
ABN, Publish Date - Mar 10 , 2024 | 07:12 PM
YS Jagan Siddham Sabha: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Reddy) ప్రసంగంలో ఒకటా రెండా.. లెక్కలేనన్ని డైలాగ్స్.. అంతకుమించి పంచ్‌లు, కౌంటర్లు ఉంటాయ్.! ఇవన్నీ ఒకసారి, రెండు సార్లు మహా అంటే మూడు సార్లు వినడానికి బాగుంటుంది కానీ.. ఏ సభలో చూసినా ఇవే మాటలు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇవే డైలాగ్స్.. ఇప్పుడు చెప్పండి.. పదే పదే అవే మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది.. విరక్తి అనిపించదూ.!
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Reddy) ప్రసంగంలో ఒకటా రెండా.. లెక్కలేనన్ని డైలాగ్స్.. అంతకుమించి పంచ్‌లు, కౌంటర్లు ఉంటాయ్.! ఇవన్నీ ఒకసారి, రెండు సార్లు మహా అంటే మూడు సార్లు వినడానికి బాగుంటుంది కానీ.. ఏ సభలో చూసినా ఇవే మాటలు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇవే డైలాగ్స్.. ఇప్పుడు చెప్పండి.. పదే పదే అవే మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది.. విరక్తి అనిపించదూ.! ఇక ఈ సభలు చూసిన, ప్రసంగం విన్న సామాన్య ప్రజలకే కాదు.. సొంత పార్టీ కార్యకర్తలు, నేతలకూ విరక్తి పుడుతోందట. ఏంట్రా బాబూ అరిగిపోయిన క్యాసెట్‌లాగా.. ఈ పాతపురాణం అంటూ వైసీపీ శ్రేణులు విస్తుపోతున్నాయట. ‘సిద్ధం’ అంటూ ఎన్నికల ముందు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభల్లో ఎక్కడ సభ నిర్వహించినా.. ఎప్పుడు చూసినా జగన్ నోట నాలుగే నాలుగు మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయ్. ఈ మాటలే అన్ని సభల్లో విని విని సొంత పార్టీ వాళ్లే.. ఎవడ్రా ఆ స్పీచ్ రాసింది మార్చండి మహాప్రభో అని దండం పెడుతున్న పరిస్థితి.
TDP: అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు.. ఈ పేర్లు ఉంటాయా..?
ఎప్పుడైనా.. ఎక్కడైనా..!
ఎప్పుడు చూసినా.. ఎక్కడ సభలో మాట్లాడినా వైఎస్ జగన్ నోట.. ‘ఎల్లో మీడియా’, ‘చంద్రబాబు పొత్తులు’, ‘పవన్ పెళ్లాలు’.. ‘ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయటే ఉండాలి.. గ్లాస్ సింకులోనే ఉండాలి’ అంటూ ఇవే డైలాగ్స్ వస్తున్నాయ్. ‘సిద్ధం’ సభ ప్రారంభం మొదలుకుని.. ఇవాళ్టి చివరి సభ వరకూ జగన్ చేసిన గంటల కొద్దీ ప్రసంగంలో బహుశా ఈ డైలాగ్స్ వందల సార్లు వినిపించే ఉంటాయ్. దీంతో ఈ సభలకు వెళ్లిన జనాలు, కార్యకర్తలు, వీరాభిమానులు.. ఇంటి దగ్గర టీవీలు, యూట్యూబ్‌లో చూసిన ప్రజలు.. అవే డైలాగ్స్ విని విని విసిగెత్తిపోయి తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఈ పాత చింతకాయ పచ్చడిలా ఎన్నిసార్లు ఇదే ప్రసంగం వింటాం అంటూ జనాలు ఛీ కొట్టేస్తున్న పరిస్థితి. ఇక మీమ్స్, సోషల్ మీడియాలో కామెంట్స్‌కు అయితే అస్సలే కొదువలేదు. ఎంతసేపు ఇవే మాటలు చెబుతుండటంతో సొంత పార్టీ నేతలు సైతం ‘మాకేంటీ ఖర్మ’ అంటూ అటు జగన్‌కు చెప్పలేక.. ఇటు మనసులో పెట్టుకోలేక..ఉండిపోతున్నారట.
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
చేసింది ఏముంది..?
సీఎం స్థాయి వ్యక్తి సభ పెడితే.. చేసిన పనులు, చేయాల్సిన పనులు.. చేస్తామన్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు గురించి చెప్పాలి కానీ.. జగన్ మాత్రం అబ్బే వాటి జోలికే వెళ్లరు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక కూల్చుడు తప్ప కట్టుడు లేదు.. ఉన్న అభివృద్ధిని అటకెక్కించడం తప్ప.. అభివృద్ధి శూన్యమనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయ్. కనీసం రాజధాని ఏదంటే సగటు ఆంధ్రుడు నోరి తెరిచి చెప్పుకోలేని పరిస్థితి. ఇక నవరత్నాలు అంటారా..? వైసీపీ కార్యకర్తలు, నేతల కుటుంబాలకే తప్ప సామాన్యుడికి చేరువయ్యిందనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తోంది. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే సవాలక్ష చెప్పుకోవచ్చు మరి.
ఎందుకనీ..?
గంటల కొద్దీ చేస్తున్న ఈ ప్రసంగంలో కాస్తో.. కూస్తో నవరత్నాలు, వలంటీర్లు గురించి ఉంటుందే తప్ప.. ఎక్కడా ఇదిగో ఫలానా చేశామని కానీ.. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తామనేది..? కానీ ఎక్కడా వినిపించదు.. కనిపించదు కూడా. ఇలాంటప్పుడు జగన్ ప్రసంగం ఎవరికి మాత్రం బోర్ కొట్టకుండా ఉంటుంది చెప్పండి. స్పీచ్‌లో ఎన్నో డైలాగ్స్, పంచ్‌లు.. కౌంటర్లు కనిపించినట్లే ఉంటాయ్ కానీ.. అబ్బే అవన్నీ పసలేనట్టే ఉంటున్నాయ్. స్పీచ్ ప్రారంభించినప్పటి నుంచి చివరి వరకూ చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా అంటూ పైత్యపు మాటలు తప్పితే.. ప్రజలకు ఇన్నాళ్లు ఏం చేశాం..? మళ్లీ వైసీపీని గెలిపిస్తే ఏం చేస్తామనేది మాత్రం జగన్ నోట ఒక్కసారంటే ఒక్కసారి కూడా పొరపాటున కూడా రాదు. దీంతో వద్దు బాబోయ్.. మా కొద్దు ఈ స్పీచ్ అంటూ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 10 , 2024 | 07:14 PM