ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRCP : వైసీపీకి మరో ఊహించని షాక్.. టీడీపీలో చేరిన కడప జిల్లా సీనియర్ నేత

ABN, Publish Date - Jan 03 , 2024 | 04:32 PM

Senior Leaders Resigns YSRCP : అవును.. వైఎస్ జగన్ పాలనపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఒకే ఒక్క ఛాన్స్ అనడంతో అవకాశం ఇచ్చిన ఏపీ ప్రజలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ప్రతిరోజూ మనం వార్తల్లో చూస్తున్నాం.. వింటున్నాం.

అవును.. వైఎస్ జగన్ పాలనపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఒకే ఒక్క ఛాన్స్ అనడంతో అవకాశం ఇచ్చిన ఏపీ ప్రజలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ప్రతిరోజూ మనం వార్తల్లో చూస్తున్నాం.. వింటున్నాం. మరోవైపు.. అభివృద్ధి అనేది ఇసుమంత అయినా లేదని.. ఇష్టానుసారం అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అసలు రానున్న ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వైసీపీ హైకమాండ్‌కే అర్థం కావట్లేదు. సరిగ్గా ఇదే టైమ్‌లో నియోజకవర్గ ఇంచార్జులను మార్చడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగా.. మరికొందరు సీనియర్, కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో వైసీపీ అన్నీ వరుస షాకులే తగిలినట్లయ్యింది.


అవును.. టీడీపీలోకే..!

తాజాగా.. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కూడా అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే.. ఈయన జగన్ సొంత ఇలాఖా కడప జిల్లా కీలక నేత కావడం గమనార్హం. బుధవారం నాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఆయన నివాసంలో రామచంద్రయ్య కలిసి.. పసుపు కండువా కప్పుకున్నారు. ఈయనతో పాటు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాథ రెడ్డి, పలువురు కడప జిల్లాకు చెందిన కీలక నేతలు సైకిలెక్కేశారు. చేరికకు ముందు రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో చేరేందుకు పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌కు వచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదు. నాలాగే వైసీపీలో ఎంతో మంది ఉన్నారు.. సమయానుకూలంగా బయటికి వస్తారు. తెలుగుదేశం లో చేరేందుకే నేను చంద్రబాబును కలిశాను. పదవుల కంటే సమాజమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానురామచంద్రయ్య మీడియాకు వెల్లడించారు.

మొత్తానికి చూస్తే.. వైసీపీలో రాజీనామాల పర్వం ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. మరోవైపు ఇంచార్జుల మార్పు కూడా వైసీపీకి పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించి, 2019 ఎన్నికల్లో సైకిల్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలు 2023 ఎన్నికలకు ముందు పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వైసీపీలో పరిస్థితులు బాగోలేకపోవడం.. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోందని తెలుసుకున్న నేతలంతా మళ్లీ సొంత గూటికి వచ్చేస్తున్నారు. మున్ముందు ఇంకా ఎంతమంది నేతలు, సిట్టింగ్‌లు టీడీపీలోకి వస్తారో చూడాలి మరి.

Updated Date - Jan 03 , 2024 | 04:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising