ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: సిబ్బందికి వేతనాలు పెంచారని.. ఓనర్లకు జైలు శిక్ష

ABN, Publish Date - Jul 03 , 2024 | 01:20 PM

ఇటివల ఓ ప్రాంతంలో సిబ్బంది వేతనాలు(wages) పెంచారనే కారణంతో వారి యజమానులకు జైలు శిక్ష విధించారు. అందేటీ అనుకుంటున్నారా. అవును మీరు చదివింది నిజమే. ఈ వింత సంఘటన మయన్మార్‌(Myanmar)లో ఇటివల చోటుచేసుకుంది. అయితే అసలు ఎందుకు అలా చేశారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

shopkeepers jailed

ఇటివల ఓ ప్రాంతంలో సిబ్బంది వేతనాలు(wages) పెంచారనే కారణంతో వారి యజమానులకు జైలు శిక్ష విధించారు. అందేటీ అనుకుంటున్నారా. అవును మీరు చదివింది నిజమే. ఈ వింత సంఘటన మయన్మార్‌(Myanmar)లో ఇటివల చోటుచేసుకుంది. అయితే అసలు ఎందుకు అలా చేశారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మయన్మార్ దేశవ్యాప్తంగా సైనిక పాలన కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు(people) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు దేశంలో ద్రవ్యోల్బణం(inflation) కూడా తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.


కారణమిదే..

ఈ నేపథ్యంలోనే పలువురు దుకాణదారులు(shop owners) వారి సిబ్బందికి వేతనాలను పెంచారు. ఈ క్రమంలోనే అక్కడి సైనిక ప్రభుత్వం ఇలాంటి నేరాలకు పాల్పడిన 10 మంది దుకాణదారులకు జైలు శిక్షను విధించింది. అయితే దేశంలో ద్రవ్యోల్బణం ఉన్న వేళ ఉద్యోగుల జీతాలు పెంచి అస్థిర వాతావరణానికి పాల్పడ్డారనే కారణంతో వారిని అదుపులోకి తీసుకుని ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత వారి షాపులను కూడా మూసివేయించారు. మయన్మార్‌లో వేతనాలు(salaries) పెంచడం చట్టవిరుద్ధం కాదు. కానీ ద్రవ్యోల్బణం వేళ పెంచడం సరికాదని అక్కడి ప్రభుత్వం అంటోంది.


నెటిజన్ల ఆగ్రహం

ఇది తెలిసిన నెటిజన్లు(netizens) మయన్మార్‌ సైనిక పాలన భిన్నంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. పనిచేసుకునే కార్మికుల వేతనాల విషయంలో కూడా ఇలా వ్యవహరించడం దారణమని అంటున్నారు. రేట్లు పెరిగిన సమయంలో కూడా వేతనాలు పెంచితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది మాత్రం వ్యాపార యజమానుల పాలనను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మరోవైపు అక్కడి ప్రజలు మాత్రం పెరిగిన ధరలతో అల్లాడిపోతున్నారు.


Also Read:

Viral Video: ఎడ్ల సంతలో రిపోర్టర్ ఓవర్ యాక్షన్.. దున్నపోతు ఏం చేసిందంటే..


నెల రోజులు కాకుండానే ఎదురుదాడి..

జగన్‌కు ఝలక్.. ఇక నో హై సెక్యూరిటీ జోన్‌!

తొలిసారి 80,000 క్లబ్‌లోకి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా

For More Trending News and Telugu News..

Updated Date - Jul 03 , 2024 | 01:23 PM

Advertising
Advertising