ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇద్దరు భర్తలతో మహిళ కాపురం! ఎలా మేనేజ్ చేస్తున్నావని అడిగితే..

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:40 PM

మెడలో రెండు మంగళసూత్రాలు ధరించి, పక్కనే తన ఇద్దరు భర్తలను కూర్చోపెట్టుకుని ఓ మహిళ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆ మహిళ మెడలో మెరుస్తున్న రెండు బంగారు మంగళసూత్రాలు. ఆమెకు ఇరువైపులా నిలబడ్డ భర్తలు. ఇద్దరి మధ్యా నిలబడి వారి భుజాలపై చేయి వేసి ఫొటోలకు పోజులిచ్చిందా మహిళ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలు ఇవి. బహుభార్యత్వం తప్పంటూ పోరాడి చట్టాలు సాధించుకున్న దేశంలో ఓ మహిళ ఇద్దరు భర్తలతో కలిసి ఒకే ఇంట్లో జీవిస్తోంది. తమ బంధానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న మాటలు తెగ వైరల్ అవుతున్నాయి (Viral).

Viral: ఆడ తోడు లేని మగాళ్లే ఆమె టార్గెట్! ఫేక్ కేసులతో రూ.1.25 కోట్లు లూటీ!


ఉత్తరప్రదేశ్‌లోని దియోరా ప్రాంతానికి చెందిన ఈ మహిళ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన బంధంపై ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె వారిద్దరినీ ఇరువైపులా కూర్చోబెట్టుకుని మరీ తమ బంధం గురించి వివరించింది. ఇద్దరు భర్తలు ఉన్నారు కాబట్టి రెండు మంగళసూత్రాలు ధరించినట్టు చెప్పుకుంది. ఇద్దరు భర్తలు ఉన్నప్పుడు రెండు మంగళసూత్రాలు కావాలి కదా అని ఎదురు ప్రశ్నించింది. ఇక వాటిపై భర్తల పేర్లు కూడా ముద్రించి ఉన్నాయి. తామందరం ఒకే ఇంట్లో ఉంటున్నామని ఆమె చెప్పింది. ఇదేలా సాధ్యమని వీడియోలోని వ్యక్తి ప్రశ్నించగా తాను అలాగే మేనేజ్ చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళతామని, కలిసి భోజనం చేస్తామని, కలిసి బాధ్యతలు పంచుకుంటామని చెప్పింది.

Viral: పెంగ్విన్‌లు ఇలాక్కూడా చేస్తాయా? తన దారికి అడ్డుగా మనుషులుంటే..


కాగా, ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నతమైన వివాహ వ్యవస్థను కించపరచొద్దని కొందరు హితవు పలికారు. కొందరు మహిళపై విమర్శలు ఎక్కుపెట్టారు. రకరకాల కామెంట్స్‌తో నెట్టింట హోరెత్తించారు. మరికొందరు మాత్రం అసలు ఇదంతా నిజమేనా అని సందేహం వెలిబుచ్చారు. వైరల్ అవ్వాలనే ప్రయత్నంలో ఇలాంటి వీడియోను జనాలపైకి వదిలారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది. జనాలు విస్తుపోయేలా చేస్తోంది. ఈ మధ్య ఓ యువతి తనను తానే పెళ్లి చేసుకుని ఆపై విడాకులు తీసుకున్న వైనం వైరల్ అయిన విషయం తెలిసిందే. మరి తాజా వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Jeff Bezos Wedding: నా పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చా.. పచ్చి అబద్ధం: జెఫ్ బెజోస్

Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు

Read Latest and Viral News

Updated Date - Dec 23 , 2024 | 01:47 PM