Viral Video: వీళ్లు కాపాడకుంటే ఈ యువకుడి పరిస్థితి ఏంటి.. 14వ అంతస్తు నుంచి సూసైడ్ అటెమ్ట్
ABN, Publish Date - Oct 21 , 2024 | 09:51 PM
ఓ 21 ఏళ్ల కుర్రాడు 14వ అంతస్తులో బాల్కనీ నుంచి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఆ వ్యక్తిని సకాలంలో వెనక్కిలాగారు. దీనికి సంబంధించిన వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి డిప్రెషన్ సమస్యలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. సెలబ్రిటీలతోపాటు అనేక మంది యువకులు కూడా ఈ కారణంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ 21 ఏళ్ల యువకుడు సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అది కూడా 14వ అంతస్తు నుంచి దూకేందుకు సిద్ధమయ్యాడు. అదే క్రమంలో గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమై, ఆ యువకుడి వద్దకు వెళ్లి సూసైడ్ చేసుకోకుండా ఆపారు. ఈ ఘటన నోయిడా(Noida) సెక్టార్ 74లోని సూపర్‌టెక్ కేప్ టౌన్ సొసైటీలో ఇటివల చోటుచేసుకుంది.
వైరల్ వీడియో
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పద్నాలుగో అంతస్తులో అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి 21 ఏళ్ల వ్యక్తి దూకేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వెనుక నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ యువకుడిని కాపాడారు. వీడియో చూస్తుంటే వారు రావడం కొంచెం ఆలస్యమైనా కూడా యువకుడు సూసైడ్ చేసుకునే వాడేమో అనిపిస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సూపర్‌టెక్ కేప్ టౌన్ సొసైటీలో సోమవారం ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన జరిగింది.
స్థానికుల అప్రమత్తం
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం ఆరా తీస్తే ఆరు నెలల క్రితం యువకుడు తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి నోయిడాలోని సెక్టార్ 41లో నివసిస్తున్నాడు. ఘటన జరిగే వరకు ఆ యువకుడి గురించి కుటుంబ సభ్యులకు విషయం తెలియదు. రక్షించిన అనంతరం పోలీసులు అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ యువకుడు మానసిక సమస్యలతో సతమతమవుతూ చికిత్స పొందుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను దీర్ఘకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, అతడికి చికిత్స కొనసాగుతోందని కుటుంబీకులు వెల్లడించారు.
కామెంట్లు
అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి సాధారణంగానే ఉందని, తదుపరి చర్యలు తీసుకోవడం లేదని అధికారులు ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి మానసికి సమస్యల కారణంగానే సూసైడ్ చేసుకున్నాడా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనేది మాత్రం పూర్తిగా తెలియలేదు. మరోవైపు అతని మానసిక పరిస్థితి సరిగా లేకుంటే ఫ్యామిలీతో ఎందుకు ఉండటం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతని ఫ్యామిలీ ఆ సమయంలో ఎక్కడికి వెళ్లారని, అతను ఒంటరిగా ఎందుకు నివసిస్తున్నాడని అంటున్నారు. ఈ ఘటన జరిగే సమయం వరకు అతని గురించి ఫ్యామిలీకి తెలియకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
ఇవి కూడా చదవండి..
బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 21 , 2024 | 09:53 PM