Viral Video: బంగాళాదుంపల బాక్సు నుంచి వింత శబ్ధాలు.. కంగారుగా తెరచి చూడగా.. షాకింగ్ సీన్..

ABN, Publish Date - Sep 11 , 2024 | 07:29 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. అనూహ్య ప్రదేశాల్లో పాములు, కొండచిలువలు కనిపించడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. కొన్నిసార్లు అవి కనింపించే తీరు చూస్తే ఒళ్ల గగుర్పొడిచేలా ఉంటుంది. తాజాగా...

Viral Video: బంగాళాదుంపల బాక్సు నుంచి వింత శబ్ధాలు.. కంగారుగా తెరచి చూడగా.. షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. అనూహ్య ప్రదేశాల్లో పాములు, కొండచిలువలు కనిపించడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. కొన్నిసార్లు అవి కనింపించే తీరు చూస్తే ఒళ్ల గగుర్పొడిచేలా ఉంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హోటల్‌కు వచ్చిన కూరగాయల బాక్సుల నుంచి వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో అనుమానం వచ్చి బంగాళాదుంప బాక్సు తెరిచి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) చంద్రాపూర్‌లోని ఓ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోజూ మాదిరే ఆ రోజు కూడా కూరగాయలతో నిండిన బాక్సులు హోటల్‌కు పార్సిల్ వచ్చాయి. వంట చేసే సమయంలో కూరగాయల కోసం బాక్సులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే బంగాళాదుంపుల బాక్స్ నుంచి వింత వింత శబ్ధాలు వస్తుండడం చూసి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..


python-in-potatoes-box.jpg

చివరకు అంతా కలిసి బాక్సును తెరచి చూడగా.. అందులో (python in potatoes box) 8 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. దీంతో హోటల్ సిబ్బంది అక్కడి నుంచి బయటికి పరుగులు పెట్టారు. చివరకు సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పరిశీలించాడు. కొండచిలువను చివరకు సురక్షితంగా పట్టుకుని సమీపంలోని అడవిలో వదిలేశాడు. కొండచిలువలు ఇలా కనిపించడం కొత్తేమీ కాదు.

Viral Video: నదిలో సినిమాటిక్ రీల్ చేసేందుకు యువతి ప్రయత్నం.. అంతా బాగానే చేసింది కానీ.. చివర్లో..


గతంలో ఇళ్ల సీలింగ్‌లు, వాహనాలు తదితర ప్రదేశాల్లో కనిపించి అందరినీ హడలెత్తించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఎక్కడ నుంచి వచ్చిందీ కొండచిలువ’’.. అంటూ కొందరు, ‘‘కొండచిలువను పార్సిల్ చేయడమేంట్రా.. అవేమన్నా కూరగాయలు అనుకున్నారా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 11 , 2024 | 07:42 PM

Advertising
Advertising