ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengalure: బెంగళూర్ వీధుల్లో బౌన్సర్ రచ్చ.. రచ్చ...

ABN, Publish Date - Aug 20 , 2024 | 08:48 PM

బెంగళూర్ వీధుల్లో ఓ బౌన్సర్ రచ్చ రచ్చ చేశాడు. ఓ కారు డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు. పక్కన జనం ఉన్నా.. సెక్యూరిటీ సిబ్బంది ఉన్న ఏ మాత్రం వినిపించుకోలేదు.

Bouncer Attacks Car

బెంగళూర్: జనాలకు ఓపిక ఉండటం లేదు. యువత కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదు. చిన్న విషయానికే ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కొందరైతే చేతులకు పని చెబుతున్నారు. బెంగళూర్ (Bengalure) వీధుల్లో ఓ బౌన్సర్ రచ్చ రచ్చ చేశాడు. ఓ కారు డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు. పక్కన జనం ఉన్నా.. సెక్యూరిటీ సిబ్బంది ఉన్న ఏ మాత్రం వినిపించుకోలేదు.


ఇది విషయం..

బెంగళూర్ దొడ్డకన్నల్లి వద్ద నిన్న రాత్రి (సోమవారం) 10.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కారులో ఫ్యామిలీ ప్రయాణం చేస్తోంది. భార్య, భర్త, ఏడు నెలల చిన్నారి కారులో ఉన్నారు. కారు వెళ్లే సమయంలో ఇండికేటర్ వేయకుండా ఎడమవైపునకు కారును తిప్పాడు. కారు ఓనర్ చేసిన తప్పుతో బైకర్ (బౌన్సర్) రెచ్చిపోయాడు. కారులో ఉండి ఏసీ వేసుకున్న ఫ్యామిలీకి చల్లగా చమటలు పట్టించాడు.



బయటకు రా..

బైక్ మీద వెళుతోన్న ఆ వ్యక్తి కారు సడెన్‌గా లెప్ట్‌కు తిప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. బండి ఆపి కారు వద్దకు వచ్చాడు. కారు ఓనర్‌ను దిగాలని కోరతాడు. అప్పటికే అతను తాగి ఉండటంతో లోన ఉన్న వారు భయపడ్డారు. చిన్నారి ఉందని, నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. లాభం లేదని బండరాయి తీసుకొని వచ్చాడు. అప్పటికే ఇద్దరు, ముగ్గురు వచ్చి బౌన్సర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోలేదు.



కారు అద్దంపై దాడి..

బయటకు రావాలని పిలిస్తే రావడం లేదని బౌన్సర్‌కు కోపం వచ్చింది. ఏముంది.. కారు ముందటి వైపర్‌ను విరిచాడు. ఆ వెంటనే కారు అద్దంపై కొట్టాడు. అతనిని ఆపేందుకు పక్కన ఉన్నవారు ప్రయత్నం చేసినప్పటికీ రెండు, మూడు సార్లు కొట్టాడు. కారు అద్దం పగిలి ఉండటాన్ని వీడియోలో చూడొచ్చు. మరికొందరు అతన్ని పక్కకు తీసుకెళతారు. ఇంకొందరు వచ్చి.. కారు డ్రైవర్‌తో మాట్లాడతారు. ఏం భయం లేదు. పోలీసులకు ఫోన్ చేయమని సూచిస్తున్నారు. సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వద్దకొచ్చి ఆ దంపతులు ఫిర్యాదు చేశారు. దంపతుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కారుపై దాడి చేసిన బౌన్సర్‌ను అరెస్ట్ చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారు. అక్కడున్న వారు హెల్ప్ చేయడంతో ఆ కారు డ్రైవర్ సేఫ్‌గా బయట పడ్డారు. హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో ఆ బౌన్సర్ కేసు విచారణను ఎదుర్కొనున్నాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 08:48 PM

Advertising
Advertising
<