Share News

Viral News: 11 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Sep 27 , 2024 | 08:28 AM

ఆ వ్యక్తి 11 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు.. కుటుంబ సభ్యులు అతడి కోసం ఎంతగానో వెతికారు.. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ గాలించారు.. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు.. అతడు లేకుండానే బతకడం అలవాటు చేసుకున్నారు.. అయితే 11 ఏళ్ల తర్వాత అద్భుతం జరిగింది..

Viral News: 11 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఆ బాలుడు (Boy) 11 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు (Missing).. కుటుంబ సభ్యులు అతడి కోసం ఎంతగానో వెతికారు.. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ గాలించారు.. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు.. అతడు లేకుండానే బతకడం అలవాటు చేసుకున్నారు.. అయితే 11 ఏళ్ల తర్వాత అద్భుతం జరిగింది.. చనిపోయాడనుకున్న వ్యక్తి సజీవంగా తిరిగి వచ్చాడు.. దీంతో ఆ కుటుంబంలో సంతోషం నెలకొంది.. హర్యానాలో జరిగిన ఈ కథ మొత్తం తెలుసుకుంటే షాక్ అవక తప్పదు (Viral News).


హర్యానా (Haryana)లోని కర్నాల్ జిల్లాకు చెందిన సత్బీర్ అనే వ్యక్తి 11 ఏళ్ల క్రితం 9 ఏళ్ల వయసులో తప్పిపోయాడు. అతడి గురించి తల్లిదండ్రులు ఎంతగానో గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌కు ఫిర్యాదు చేశారు. హర్యానా నుంచి తప్పిపోయిన ఆ బాలుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు దశాబ్దం కిత్రమే కాపాడారు. లక్నోలోని ప్రభుత్వ సంరక్షణ సంస్థలో ఆ బాలుడిని ఉంచి సంరక్షిస్తున్నారు. మరోవైపు సత్బీర్ తల్లిదండ్రులు పోస్టర్లు అంటించి కొడుకు కోసం గాలింపులు చేపట్టారు. ఆ పోస్టర్ వివరాలు లక్నోలోని ప్రభుత్వ సంరక్షణ సంస్థ ప్రతినిధుల కంట పడడంతో కథ సుఖాంతం అయింది.


సత్బీర్ కాలిపై కుక్క కాటు మచ్చ ఉంటుందని తల్లి చెప్పిన ఆనవాలుతో ప్రభుత్వ సంరక్షణ సంస్థ ప్రతినిధులు ఏకీభవించారు. వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం అందించారు. సత్బీర్‌ను పంజాబ్ క్రైమ్ పోలీసుల సమక్షంలో అతడి తల్లిదండ్రులకు హ్యాండోవర్ చేశారు. అలా దాదాపు 11 ఏళ్ల తర్వాత సత్బీర్ తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్నాడు. ఆశలు వదిలేసుకున్న కొడుకు తిరిగి రావడంతో అతడి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీరు పజిల్ స్పెషలిస్టులా?.. ఈ వర్డ్ పజిల్‌లోని ``IRON``ను 8 సెకెన్లలో కనుక్కోండి...


Viral Video: ఈ వ్యక్తి నిజంగా గొప్పవాడే.. ప్రాణాలతో పోరాడుతున్న పిచ్చుకను ఎలా కాపాడాడో చూడండి.. వీడియో వైరల్..


Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకేసారి ఆరు చపాతీలను ఎలా వత్తేస్తోందో చూడండి..


Viral Video: అయ్యో.. స్పైడర్ మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితా?.. రైల్వే స్టేషన్ ముందు ఎందుకు అడుక్కుంటున్నాడంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2024 | 08:28 AM