Viral Video: రీల్ కోసం హద్దుమీరిన యువతి.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ..
ABN, Publish Date - Jun 20 , 2024 | 05:48 PM
ప్రస్తుత తరంలోని యువతకు ‘రీల్స్ ఫీవర్’ బాగా పట్టుకుంది. తమ వీడియోలు వైరల్ అయితే.. పాపులారిటీ వస్తుందన్న ఉద్దేశంతో రీల్స్ చేయడంలోనే పబ్బం గడిపేస్తున్నారు.
ప్రస్తుత తరంలోని యువతకు ‘రీల్స్ ఫీవర్’ (Reels) బాగా పట్టుకుంది. తమ వీడియోలు వైరల్ అయితే.. పాపులారిటీ వస్తుందన్న ఉద్దేశంతో రీల్స్ చేయడంలోనే పబ్బం గడిపేస్తున్నారు. ఇలా రీల్స్ చేయడంలో తప్పేమీ లేదు కానీ, కొందరు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. త్వరగా వైరలవుతాయన్న ఉద్దేశంతో.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ, వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ యువతి కూడా అలాగే హద్దుమీరింది. కదులుతున్న రైలులో డేంజరస్ స్టంట్ చేసి విమర్శపాలవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోని చూస్తే.. అందులో ఓ యువతి కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డు వద్ద ‘హోగా తుమ్‌సే ప్యారా కౌన్’ అనే బాలీవుడ్ పాటపై డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. కొన్నిసార్లు ఆమె డ్యాన్స్ చేస్తూ.. గేటు అంచులదాకా వెళ్లింది. ఆ సమయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగి ఉన్నా.. పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా ఆమె నిర్భయంగా రీల్ చేయడంలో బిజీ అయిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఒకవేళ ఆమె డ్యాన్స్ చేస్తూ తడబడి ఉండుంటే.. ఏమై ఉండేదో మీరు ఊహించుకోండి. అందుకే.. రీల్స్ కోసం ఇలాంటి సాహసాలు చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.
‘ఛప్రా జిలా’ అనే ఎక్స్ ఖాతా ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘ఈరోజుల్లో జనాలు రీల్స్ మోజులో తమ ప్రాణాలను సైతం పట్టించుకోవడం లేదు’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. కదులుతున్న రైలులో ఇలాంటి స్టంట్స్ చేయకూడదని అంటున్నారు. ఓ యూజర్ అయితే.. ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టాలంటే, కచ్ఛితంగా జరిమానా విధించాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఇటువంటి రీల్స్ చేయడం ఎంతో ప్రమాదకరమైనదని, వీరిని దారిలో పెట్టాలంటే జరిమానా విధించడమే మార్గమని పేర్కొన్నాడు. మరి.. ఈ రీల్‌పై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో? వేచి చూడాల్సిందే.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jun 20 , 2024 | 06:05 PM