Viral Video: పాపం.. బైక్ ఎక్కిన స్నేహితుడికి షాక్.. రోడ్డు మీద ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..
ABN, Publish Date - Dec 20 , 2024 | 07:08 PM
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆకర్షణీయంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. బైక్ ఎక్కిన స్నేహితుడికి ఓ వ్యక్తి మర్చిపోలేని షాకిచ్చాడు. ఆ వీడియో చూసిన వారు నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆకర్షణీయంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి (Funny Videos). ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. బైక్ (Bike stunt) ఎక్కిన స్నేహితుడికి ఓ వ్యక్తి మర్చిపోలేని షాకిచ్చాడు. ఆ వీడియో చూసిన వారు నవ్వుకుంటున్నారు. @Kohled_Eyes అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి షాప్ ముందు పార్క్ చేసిన బైక్‌ను తీసి స్టార్ట్ చేశాడు. అతడి స్నేహితుడు వెనుక సీట్లో కూర్చున్నాడు. ఆ వ్యక్తి తన బైక్‌ను తిప్పి రోడ్డుపై స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బైక్ ముందు చక్రం గాల్లోకి ఎత్తగానే బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో ఆ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి కిందప డిపోయాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా నవ్వుతూ ఉండిపోయాడు. ఆ వీడియో షాప్ ముందు అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``వావ్, వాట్ ఎ బ్లాస్ట్``, ``అకస్మాత్తుగా పొరపాటు జరిగింది``, ``సమస్య లేదు, కొన్నిసార్లు ఇది జరుగుతుంది``, ``ఫన్నీ మూమెంట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: ఉబర్‌లో క్యాబ్ బుక్ చేస్తే.. వచ్చినదాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు.. వీడియో వైరల్..
Viral Video: రీల్స్ కోసం ఇలా చేయడం తప్పు.. ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు ఎందుకంటే..
Optical Illusion Test: మీవి నిజంగా డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో గ్లౌస్, చేప ఎక్కడున్నాయో కనుక్కోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 20 , 2024 | 07:08 PM