ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: చెమటలు పట్టించిన చిరుత.. ఇళ్ల పై కప్పు నుంచి దూకుతూ.. వీడియో వైరల్..

ABN, Publish Date - Apr 02 , 2024 | 12:25 PM

జంతువులు అడవిలో ఉండాలి. మనుషులు ఇళ్లల్లో ఉండాలి. ఇది ప్రకృతి ధర్మం. కానీ విచక్షణ కోల్పోయిన మానవుడు స్వార్థంతో అంతా తనదే అనుకుంటున్నాడు. అడవులను విచ్చలవిడిగా నరికేస్తూ విధ్యంసానికి పాల్పడుతున్నాడు.

జంతువులు అడవిలో ఉండాలి. మనుషులు ఇళ్లల్లో ఉండాలి. ఇది ప్రకృతి ధర్మం. కానీ విచక్షణ కోల్పోయిన మానవుడు స్వార్థంతో అంతా తనదే అనుకుంటున్నాడు. అడవులను విచ్చలవిడిగా నరికేస్తూ విధ్యంసానికి పాల్పడుతున్నాడు. దీంతో ఆవాసం కోల్పోయిన అడవి జంతువులు దారి తప్పుతున్నాయి. ఆహారం, నీరు, ఆవాసం కోసం అరణ్యం నుంచి జనారణ్యాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామస్థులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోకి ప్రవేశించిన అడవి జంతువులు పలుమార్లు ప్రజలపై దాడి చేసిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ప్రస్తుతానికి కూడా ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ ( Viral ) అవుతున్న ఈ క్లిప్ లో ఏముందో, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

Patanjali Case: పతంజలి తప్పుడు ప్రకటనల కేసు.. సుప్రీం కోర్టుకు రామ్ దేవ్ క్షమాపణలు..

దిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ చిరుతపులి కనిపించింది. ఐదుగురు వ్యక్తులపై దాడికి పాల్పడింది. సోమవారం ఉదయం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించిన చిరుత ఇళ్ల కప్పులపై దూకుతూ కలకలం సృష్టించింది. చిరుతను చూసి భయంతో పరుగులు తీసిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వారు ఫారెస్ట్ ఆఫీసర్స్ తో కలిసి స్పాట్ కు చేరుకున్నారు. చిరుత దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.


Encounter: తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. నలుగురు మావోల మృత్యువాత

చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించినట్లు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక దళ అధికారులు చెప్పారు. రెండు ఫైర్ ఇంజిన్లను దిల్లీలోని వజీరాబాద్‌ జగత్‌పూర్‌ గ్రామానికి పంపించామన్నారు. స్థానికుల సాయంతో రెస్క్యూ టీం చిరుతను పట్టుకున్నారన్నారు. ఇళ్ల పై కప్పుల నుంచి దూకుతూ భయాందోళనలు కలిగిస్తున్న చిరుత వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 12:25 PM

Advertising
Advertising