ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: అమాయకత్వం కూడా అందమైనదే.. డౌటుంటే ఈ వీడియో ఓ సారి చూసేయండి..!!

ABN, Publish Date - Feb 27 , 2024 | 09:53 PM

ఇది డిజిటల్ కాలం. గుండు పిన్ను నుంచి రాకెట్ సైన్స్ వరకు ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా అంతా ఆన్ లైన్ లోనే. పిల్లల చదువులు సైతం ఆన్ లైన్ లోకి మారిపోయాయి. ఇక ప్రభుత్వ కార్యకలాపాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇది డిజిటల్ కాలం. గుండు పిన్ను నుంచి రాకెట్ సైన్స్ వరకు ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా అంతా ఆన్ లైన్ లోనే. పిల్లల చదువులు సైతం ఆన్ లైన్ లోకి మారిపోయాయి. ఇక ప్రభుత్వ కార్యకలాపాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమస్త సేవలన్నీ ఇంటర్నెట్ లోనే. రోజురోజుకు అప్‌గ్రేడ్ అవుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా మనం మారడం అత్యవసరం. నేడు దాదాపు ప్రతి పని ఇంటర్నెట్ ద్వారానే జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల నుంచి ఆఫీసు పని వరకు దాదాపు ప్రతిదీ ఇంటర్నెట్‌లోనే జరుగుతోంది. కానీ గ్రామంలోని కొంతమందికి ఈ డిజిటల్ యుగం, ఇంటర్నెట్ గురించి పెద్దగా తెలియదు. దీంతో కార్యాలయాల్లో పని జరగక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జరిగిన ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి తన పని కోసం డిజిటల్ సర్వీస్ సెంటర్ కు వచ్చాడు. అతని సమస్యను విన్న సిబ్బంది.. ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్‌ తీసుకురమ్మని చెప్పారు. ఆయనకు ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్లి మొబైల్ ఫోన్‌కు బదులుగా ల్యాండ్‌లైన్ ఫోన్‌ను తీసుకువచ్చాడు. అంతే కాకుండా ఫోన్ తీసుకువచ్చాను. నా పని చేసి పెట్టండి అని అమాయకంగా చెప్పడంతో అక్కడి సిబ్బందికి ఏం చేయాలో అర్థం కాక అవాక్కయ్యారు. కాసేపటి తర్వాత పరిస్థితిని వివరించి అతని పనిని చక్కదిద్దారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ప్లీజ్.. దయచేసి అమాయక గ్రామస్థుల పరిస్థిని చూసి ఎగతాళి చేయకుండా వారికి అర్థమయ్యేలా చెప్పండి అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.


ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ తెగ హల్ చల్ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకు 2.1 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. "అతన్ని అవమానించకండి. వివరించడానికి ప్రయత్నించండి"., "జోక్ చేసే బదులు ఇలాంటి వారికి అవసరమైన సహాయం చేయండి". అని రాసుకొచ్చారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 09:55 PM

Advertising
Advertising