ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: అరె ప్రతి ఫ్రెండూ అవసరమేరా.. పులి అడవి దున్న మధ్య ఫైట్.. కట్ చేస్తే..

ABN, Publish Date - Feb 19 , 2024 | 07:08 PM

ప్రకృతి చాలా ప్రశాంతమైంది. ఇది పైకి కనిపించే మెరుగులు మాత్రమే. కానీ ప్రకృతి ఒడిలో జీవించే జీవులకు నిత్యం జీవన్మరణ పోరాటమే. ఒక జీవిపై మరో జీవి ఎప్పుడూ ఆధిపత్యం చూపిస్తూనే ఉంటుంది.

ప్రకృతి చాలా ప్రశాంతమైంది. ఇది పైకి కనిపించే మెరుగులు మాత్రమే. కానీ ప్రకృతి ఒడిలో జీవించే జీవులకు నిత్యం జీవన్మరణ పోరాటమే. ఒక జీవిపై మరో జీవి ఎప్పుడూ ఆధిపత్యం చూపిస్తూనే ఉంటుంది. బలవంతునిదే అక్కడ పై చేయి. బలహీనులు ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఇక వేట విషయంలో కథ మరోలా ఉంటుంది. పులి, సింహం వంటి జంతువులు తమకంటే బలహీన జంతువులపై దాడి చేస్తాయి. వేటాడేటప్పుడు కొన్నిసార్లు విజయం సాధిస్తాయి. మరి కొన్నిసార్లు విఫలమవుతాయి. పులి వేటకు సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. పరిగెత్తించి, ముచ్చెమటలు పట్టించి, పీక కొరికి.. మరీ చాలా జుగుప్సాకరంగా ఆరగిస్తాయి. ప్రస్తుతం పులి వేటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్‌లో తీసినట్లుగా తెలుస్తోంది. తాడోబాలో పులులు, మొసళ్లు, అడవి దున్నలు, జింకలు, లేళ్లు వంటి జంతువుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఓ అడవి దున్న నీళ్లు తాగేందుకు నీటి కుంట వద్దకు వచ్చింది. అప్పటికే వేట కోసం మాటు వేసిన పులి.. అదును చూసుకుని ఒక్కసారిగా ఎట్టాక్ చేసింది. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన అడవి దున్న తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా పులి శక్తి ముందు దాని బలం సరిపోలేదు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మరో దున్న వచ్చింది. రెండూ కలిసి పులిని అక్కడి నుంచి తరిమేశాయి.


ఈ వేటకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. జాగ్రత్తగా గమనించి తాడోబా అభయారణ్యంలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. కాగా తాడోబా టైగర్ రిజర్వ్‌లో గత నెలలో రెండు పులులు చనిపోయాయి. కోల్సా అటవీ ప్రాంతంలో రెండు పులుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 19 , 2024 | 07:08 PM

Advertising
Advertising