ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: అందుకే చెప్పేది.. కూల్ డ్రింక్స్ తాగొద్దని.. ఎందుకో ఈ వీడియో చూసేయండి..

ABN, Publish Date - Mar 30 , 2024 | 06:56 PM

వేసవి వచ్చేసింది. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. వాటర్ ఎంత తాగినా చెమట రూపంలో బయటకు వచ్చేస్తోంది. దీంతో గత్యంతరం లేక చాలా మంది పండ్ల రసాలు, చల్లని ద్రవ పదార్థాలు తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

వేసవి వచ్చేసింది. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. వాటర్ ఎంత తాగినా చెమట రూపంలో బయటకు వచ్చేస్తోంది. దీంతో గత్యంతరం లేక చాలా మంది పండ్ల రసాలు, చల్లని ద్రవ పదార్థాలు తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా తాత్కాలిక ఉపశమనం వెతుక్కుంటారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఎంత ప్రమాదమో మనందరికీ తెలిసిందే. అయినా తాగకుండా ఉండలేని పరిస్థితి. కూల్ డ్రింక్ తయారీలో కలిపే రసాయనాలు మన శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొందరు కల్తీ కేటు గాళ్లు రెచ్చిపోతున్నారు. అడ్డగోలు కెమికల్స్ కలుపుతూ, అపరిశుభ్ర వాతావరణంలో కూల్ డ్రింక్ బాటిళ్లు ఫిల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ( Viral ) ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Andhra Pradesh: జగన్‌కు ఓటేస్తే ఏపీని హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.. బుద్దా వెంకన్న

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఓ కంపెనీకి సంబంధించిన కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లలో డ్రింక్‌ను నింపుతున్నాడు. మరో వ్యక్తి దానికి ఒరిజినల్ లేబుల్స్ వేసి సీల్ చేస్తున్నాడు. చూడటానికి అచ్చం కంపెనీ కూల్ డ్రింక్‌లా ఉండేలా తయారు చేస్తున్నారు. ఈ తతంగాన్నంతా మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడయాలో పోస్ట్ చేశాడు. దీంతో కొద్ది సమయంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. క్లిప్ ను చూసిన నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగాలంటేనే భయమేస్తోందంటున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Chandrababu Naidu: పేదలతోనే ఉంటా.. పేదల కష్టాలు తీరే వరకూ పోరాడతా..

కాబట్టి.. వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా బయట తినే, తాగే ఆహార పదార్థాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్నదే ఆహారంగా తీసుకోవడం మంచిది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 06:56 PM

Advertising
Advertising