ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: భుజంపై కర్ర, బండిలో బ్యాగు.. డెలివరీ బాయ్ కథ

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:14 AM

అతనికో కాలు లేదు. చేసేందుకు సరైన పని లేదు. అయినప్పటికీ చిన్నబోలేదు. ఏ పని దొరికిన సరే చేద్దామని అనుకున్నాడు. డెలివరీ బాయ్‌గా మారాడు. టీవీఎస్ మోపెడ్ వేసుకొని ఫుడ్ డెలివరీ చేస్తూ సంపాదిస్తున్నాడు. ఇతరుల మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడు.

Zomato Delivery Boy,

కూటి కోసం కోటి తిప్పలు అని సామెత ఉంది. నిజమే.. జానెడు పొట్ట నింపేందుకు పనిచేస్తుంటాం. అందరిలా ఉంటే ఓకే.. కొందరికీ కాలు ఉండదు, మరికొందరికీ చేతు ఉండదు. దివ్యాంగులను సమాజం పెద్దగా పట్టించుకోదు. వారిని చూసి అయ్యో పాపం అంటోంది తప్పా.. సాయం చేసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రారు.


డెలివరీ బాయ్‌గా

పైన ఉన్న వీడియోలో ఓ వ్యక్తి జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కుడి కాలు లేదు. మోకాలు కింద నుంచి ఒక కాలు లేదు. కర్ర సాయంతో నడుస్తాడు. ఏ పని చేయాలన్నా కష్టమే.. అందుకోసమే డెలివరీ బాయ్‌గా మారాడు. టీవీఎస్ ఎక్స్ ఎల్ బండి మీద వెళుతూ ఆర్డర్ అందజేస్తున్నాడు. భుజంపై కర్ర ఉంచుకొని, తలకు హెల్మెట్ పెట్టుకొని సిటీలో వెళ్తున్నాడు. అతను అలా వెళ్తుండగా ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.



పైకి ఎక్కాలంటే కష్టమే..

ఎక్స్ఎల్ మోపెడ్ మధ్యలో డెలివరీ ఆర్డర్‌కు సంబంధించిన పెట్టుకున్నారు. అయినప్పటికీ అతను హోటల్ వద్దకెళ్లి ఆర్డర్ కలెక్ట్ చేసుకోవాలి.. ఆ తర్వాత లోకేషన్‌కు వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ ఇచ్చిన కొందరు పైన ఉంటారు. ఆ సమయంలో కష్టం అవుతుంది. జీవిత బండి నెట్టేందుకు ఆ కష్టాన్ని సంతోషంగా భరిస్తున్నాడు.


వండర్ ఫుల్..

కాలు లేకున్నా డెలివరీ బాయ్‌గా పనిచేస్తోన్న అతడిని చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. వావ్.. యువర్ ఏ గ్రేట్ పర్సన్ అని ప్రశంసిస్తున్నారు. మీలాంటి వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కీర్తించారు. నిజమే.. అతనికి ఓ కాలు లేకున్నప్పటికీ ఇతరులపై ఆధార పడలేదు. స్వ శక్తితో సంపాదిస్తూ జీవిస్తున్నాడు. మిగతా దివ్యాంగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ కళ్లకు సవాల్.. ఈ అడవిలో కప్ప ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..

Viral Video: మీరూ ఇలాంటి తప్పు చేయకండి.. ఆ కార్ డ్రైవర్ చేసిన పనికి ఏకంగా రూ.2.5 లక్షల జరిమానా..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2024 | 11:14 AM