Share News

ABN Andhra Jyothi: తెలుగింట వినిపించే వాయిస్ ఏబీఎన్

ABN , Publish Date - Oct 15 , 2024 | 01:23 PM

ఏబీఎన్ జర్నలిజం ఒక నిఘా వ్యవస్థ లాంటిది. ప్రజల సమస్యలు ఎక్కడున్నా అట్టే పట్టేసే లక్షణమున్న ప్రాతికేయమది. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టని తత్వం ఏబీఎన్‌ది..సమాచారం ప్రతీ ఒక్కరికీ చేరాలి. దాన్ని అందరూ వినియోగించుకోవాలన్న సత్సంకల్పంతో ఏబీఎన్ ముందుకు కదులుతుంది.

ABN Andhra Jyothi: తెలుగింట వినిపించే వాయిస్ ఏబీఎన్
Andhra Jyothi 15th Anniversary

ప్రజలకు ప్రభుత్వానికి వారథి ఏబీఎన్. ప్రజల హక్కుల సంరక్షణ కోసం పాటుపడే ఏబీఎన్. ఆటంకాలు సృష్టించిన వారిని పక్కకు నెట్టుకుంటూ, తన్నుకుంటూ పోయిన ఏబీఎన్. అందుకే ఎబీఎన్ జర్నలిజమంటే ఒక బెంచ్ మార్క్. అవినీతిపరులకు ఒక భయం.


ప్రజల హక్కు అయిన సమాచారాన్ని వక్రీకరించకుండా...

వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యత

ధైర్యమే పెట్టుబడి, ఆత్మసంతృప్తే రాబడి

ఏబీఎన్ జర్నలిజం ఒక నిఘా వ్యవస్థ లాంటిది. ప్రజల సమస్యలు ఎక్కడున్నా అట్టే పట్టేసే లక్షణమున్న ప్రాతికేయమది. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టని తత్వం ఏబీఎన్‌ది..సమాచారం ప్రతీ ఒక్కరికీ చేరాలి. దాన్ని అందరూ వినియోగించుకోవాలన్న సత్సంకల్పంతో ఏబీఎన్ ముందుకు కదులుతుంది. ప్రజల హక్కు అయిన సమాచారాన్ని.. వక్రీకరించకుండా, వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యతను తొలినుంచీ ఆచరిస్తూ అమలు చేస్తోంది. ధైర్యమే పెట్టుబడిగా, ఆత్మసంతృప్తే రాబడిగా.. ముందుకు దూసుకెళ్తోంది. ఆ క్రమంలోనే జనంలో 'డేర్‌ డెవిల్ ఇమేజ్‌'ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబీఎన్‌ పేరెత్తగానే దమ్మున్న ఛానెల్‌గా, దుమ్మురేపే ఛానెల్‌గా గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది.


jagan.jpg


ప్రతీ తెలుగింట వినిపించే వాయిస్

ప్రతీ ఇంటి వాయిస్ ప్రభుత్వానికి చేర్చే ఏబీఎన్

ఎంతటివారినైనా వదిలి పెట్టని ఏబీఎన్

ప్రతీ తెలుగింట వినిపించే వాయిస్ ఏబీఎన్, ప్రతీ ఇంటి వాయిస్ ప్రభుత్వం దాకా చేర్చేదీ ఏబీఎన్. తప్పులను తప్పుగా చూపిస్తూ.... ఒప్పులకు భుజం తడుతూ జనంలో మమేకమైన ఏకైక మీడియా సంస్థ కూడా ఏబీఎన్‌ మాత్రమేనని చెప్పక తప్పదు. తప్పు చేసినదీ ఎంతటివారైనా ఏబీఎన్ వదిలి పెట్టలేదు. అది గవ్నరర్ అయినా సరే లాగి బయట పడేసిన క్రెడిట్‌ ఏబీఎన్‌కు దక్కుతుంది.


kcr-12.jpg


జనం మద్దతు కూడా ఏబీఎన్‌కే....

నిషేధపు సంకేళ్లు పటాపంచలు

ఏబీఎన్ ఎప్పుడూ ప్రజాపక్షమే...

ఏబీఎన్ ప్రస్థానంలో అనేక సమస్యలు, నిషేధాలు ఎదురయ్యాయి. ఏబీఎన్ ఎప్పుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ప్రజల కోసం పోరాడే ఛానెల్ కావడంతో జనం మద్దతు కూడా ఏబీఎన్‌కు దక్కింది. నిషేధపు సంకెళ్లు పటాపంచలైపోయాయి.. ఏ ఉపద్రవం ఎదురైనా ఏబీఎన్ ప్రజాపక్షమే వహిస్తోంది. సమ్మెలు, నిరసనలు, ఉద్యమాలు, రైతులకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వాస్తవం వైపు నిలబడిన నిఖార్సైన సమాచార స్రవంతి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.


jagana.jpg


మొన్న కేసీఆర్, నిన్న జగన్ రెడ్డి

పార్టీల అక్రమాలు, లోగుట్టులు వెలికితీత

సవాలు చేసిన వారే మట్టి కరిచారు

ఏబీఎన్‌కు అండగా నిలిచిన జనం

సహనాన్ని కోల్పోకుండా, ప్రమాణాలను పాటించిన ఏబీఎన్

మొన్న తెలంగాణలో కేసీఆర్, నిన్న ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి.. ఏబీఎన్‌ను దెబ్బకొట్టాలని ఎంతగా ప్రయత్నించినా దమ్మున్న ఛానెల్ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఆ ఇద్దరు నేతలు, వారి రెండు పార్టీల అక్రమాలు, లోగుట్టులు వెలికి తీసి జనం ముందుంచింది. ఏబీఎన్‌ను పది కిలోమీటర్ల లోతున పాతరేస్తామని సవాలు చేసిన వారే తర్వాత మట్టికరిచారు. ఏబీఎన్‌ మాత్రం అన్నింటినీ తట్టుకుని నిఠారుగా నిలబడింది. ఏబీఎన్‌ను వీక్షకులకు దూరం చేయాలన్న కుయుక్తులు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కోర్టు మొట్టికాయలు వేయడంతో అప్పటి ప్రభుత్వం దారికి రాక తప్పలేదు. ఈ లోపే ఏబీఎన్ కోసం జనం రోడెక్కారు. నిర్బంధాలకు భయపడాల్సిన అవసరం లేదంటూ ఏబీఎన్‌కు అండగా నిలిచారు. సమాచార స్వేచ్ఛను శాసించే ఏబీఎన్‌ అంటే తమకెంతో గౌరవమని నినదించారు. అందుకే ఎక్కడా తత్తర పాటుకు తావు లేకుండా, ఏ సందర్భంలోనూ సహనాన్ని కోల్పోకుండా.. తనదైన ప్రమాణాలను పాటిస్తూ.. బాధ్యతను నిర్వర్తిస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.


నిజాయితీగా, నిర్భయంగా ఏబీఎన్‌ పోరాటం

కోర్టు ఆదేశాల మేరకు న్యాయబద్ధంగా తిరిగి వీక్షకులను చేరుకున్న ఏబీఎన్‌

తెలంగాణలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై నిర్బంధం విధించినప్పుడు, ఛానెల్‌ను ప్రేక్షకుల దరికి చేరకుండా అడ్డుకున్నప్పుడు నిజాయితీగా, నిర్భయంగా పోరాడింది. జనమే ప్రభంజనమై ఒక ఛానెల్‌ కోసం పోరాడింది కూడా అక్కడేనని చెప్పక తప్పదు. అది మా ఛానెల్, ఏబీఎన్ ప్రసారాలు మాకు తప్పక కావాలని జనం పట్టుబట్టారు. కోట్లాది మంది పోరాడి ఛానెల్ ప్రసారాలను సాధించుకున్నారు.

ప్రేక్షకుల ఫిర్యాదులతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా - ట్రాయ్‌ ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. అది ఏబీఎన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ అని దేశం మొత్తం గుర్తించింది.


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం

Updated Date - Oct 15 , 2024 | 01:26 PM