ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: చేపనేమో పట్టాడు గానీ.. దాని వెంటే వచ్చిన అతి పెద్ద అతిథిని చూసి షాక్.. చివరకు..

ABN, Publish Date - May 07 , 2024 | 04:03 PM

చేపల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు చేపలు పడుతుండగా ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. వలలో చేపలకు బదులుగా చిత్రవిచిత్ర జీవులన్నీ కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు...

చేపల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు చేపలు పడుతుండగా ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. వలలో చేపలకు బదులుగా చిత్రవిచిత్ర జీవులన్నీ కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అనూహ్యంగా పాములు, కొండచిలువలు కూడా దర్శనమిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు (fishing) వెళ్లాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. ఇక్కడే ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంది. అందరిలాగానే ఇతను కూడా నది ఒడ్డున తాపీగా కూర్చుని గాలంతో చేపలు పట్టేందుకు ప్రయత్నించాడు. గాలాన్ని నీటిలోకి వేసి కొద్ది సేపు వేచి చూడగానే.. ఓ చేప దానికి చిక్కుకుంది. దీంతో వెంటనే చేపను బయటికి తీయాలని ప్రయత్నించాడు.

Viral video: మెట్రో రైల్లో ప్రేమికుల పాడు పని.. ప్రయాణికుడి ఫిర్యాదుకు పోలీసుల రియాక్షన్ ఇదీ..


ఈ క్రమంలో చేపను అనుసరిస్తూ.. నీటిలో ఓ పెద్ద జీవి అటూ ఇటూ కదులుతూ కనిపించింది. తీరా చేపను బయటకు తీయగానే.. నీటిలో నుంచి ఓ పెద్ద ఎలిగేటర్ (Alligator) కూడా బయటికి వచ్చింది. ‘‘నేను తినాలని చూస్తున్న చేపను లాక్కుంటావా.. నిన్ను ఏం చేస్తానో చూడు’’.. అని అన్నట్లుగా చేపతో పాటూ అతన్ని కూడా వెంబడిస్తుంది. ఎలిగేటర్‌ను చూడగానే అతను గాలంతో సహా అక్కడి నుంచి పారిపోతాడు. అయినా ఎలిగేటర్ వదలకుండా చాలా దూరం అతన్ని వెంబడిస్తుంది.

Viral video: అయ్య బాబోయ్..! అతి పెద్ద అనకొండతో ఈత కొట్టాడు.. సమీపానికి వెళ్లడంతో.. చివరికి..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘తన చేపను లాక్కుంటే కోపం రాదా మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పాల బాటిల్‌ను పక్కకు నెట్టేసిన చిన్నారి.. అనుమానం వచ్చి పరిశీలించిన బామ్మకు దిమ్మతిరిగే షాక్..

Updated Date - May 07 , 2024 | 04:03 PM

Advertising
Advertising