ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Watch Video: ఏనుగు చిలిపితనం.. టూరిస్ట్ షాక్.. బ్యూటీఫుల్ వీడియో మీకోసం..

ABN, Publish Date - Sep 08 , 2024 | 09:33 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఇలాంటి వాటిలో ప్రకృతికి సంబంధించిన వీడియోలు మొదటి స్థానం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని జంతువులు చాలా తెలివైనవి. మనుషులతో సరదాగా నడుచుకుంటాయి.

Elephant Theft Tourist Cap

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఇలాంటి వాటిలో ప్రకృతికి సంబంధించిన వీడియోలు మొదటి స్థానం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని జంతువులు చాలా తెలివైనవి. మనుషులతో సరదాగా నడుచుకుంటాయి. అలాంటి వాటిలో మొదటి వరలో సాదు జంతువులు వస్తాయి. కుక్క, పిల్లి, పక్షలు మనుషులతో స్నేహంగా మెలుగుతాయి. ఇక వన్య ప్రాణుల విషయానికి వస్తే.. ఏనుగు చాలా తెలివైనది. కొన్ని సార్లు అది చేసే పనులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.


తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ టూరిస్ట్‌ను ఏనుగు అటపట్టించింది. చిలిపి దొంగతనం చేసి.. టూరిస్ట్‌కే షాక్ ఇచ్చింది. ఈ వీడియో తీసిన ప్రదేశం ఎక్కడోగానీ.. టూరిస్ట్ సఫారీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఏనుగు వద్ద సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అతని తలపై ఒక వైట్ క్యాప్ ఉంది. అయితే, టూరిస్ట్ సెల్ఫీ తీసుకుంటుండగా.. ఏనుగు అతని క్యాప్‌ను తన తొండంతో తీసుకుంది. దానిని నోట్లో దాచుకుంది. ఆ తరువాత తనకేమీ తెలియనట్లు నటించింది. అతన తన క్యాప్‌ తిరిగి ఇవ్వమని కోరగా.. తాను తీసుకోలేదన్నట్లుగా ఫేస్‌తో ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చింది. చివరకు ఆ టూరిస్ట్ మోకాళ్లపై కూర్చొని.. ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయవా? అని బ్రతిమిలాడగా.. అప్పుడు క్యాప్ ఇచ్చింది ఏనుగు. పక్కనే మరికొందరు టూరిస్టులు ఈ సీన్‌ను చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు.


ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వాస్తవానికి ఈ వీడియో పాతదే అయినా.. మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. వీడియోను నెటిజన్లు రీపోస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 25.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 28 వేల రీపోస్ట్‌లు చేయగా.. 3.35 లక్షల లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ బ్యూటీఫుల్ వీడియోను వెంటనే చూసేయండి.

Updated Date - Sep 08 , 2024 | 09:33 PM

Advertising
Advertising