ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Exercise Pill: ఈ టాబ్లెట్ వేసుకుంటే జిమ్‌కు వెళ్లక్కర్లేదు! కాలు కదపకుండానే కసరత్తుల బెనిఫిట్స్!

ABN, Publish Date - Mar 19 , 2024 | 08:42 PM

ఎక్సర్‌సైజులు చేయలేని వారి కోసం శాస్త్రవేత్తలు కాలుకదపకుండానే కసరత్తుల ప్రయోజనాలు చేకూర్చే ఔషధాన్ని రూపొందించారు.

ఇంటర్నెట్ డెస్క్: జీవితాంతం ఆరోగ్యంగా (Health) ఉండాలంటే ప్రతిరోజూ కసరత్తులు చేయడం తప్పనిసరి. కానీ కొందరు అనేక కారణాల రీత్యా జిమ్‌లకు వెళ్లలేరు. కనీసం వాకింగ్ కూడా చేయలేరు. ఫలితంగా ఆరోగ్యం నానాటికీ తీసికట్టుగా మారుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? అంటే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక చిన్న టాబ్లెట్ (Exercise Pill) వేసుకుంటే బొట్టు చెమట రాల్చకుండానే జిమ్‌కు వెళ్లినంత ఫలితం వస్తుందంటున్నారు.

Peanuts: వేరుశెనగలు అతిగా తింటున్నారా? అయితే ముందు ఇవి తెలుసుకోండి..


ఎమిటీ ఔషధం!

శరీరానికి ఎక్సర్‌సైజులతో కలిగే ప్రయోజనాలన్నీ కాలు కదపకుండానే అందించే ఈ ఔషధాన్ని సెయింట్ లూయీలోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. పదేళ్ల పాటు నిరంతరం శ్రమించి దీన్ని తయారు చేశారు. దీన్ని శాస్త్రీయనామం ఎల్ఎల్‌యూ-పీపీ-332. అధికశక్తి వినియోగించే కణజాలంలోని కొన్ని ప్రత్యేక రిసెప్టర్లను ఈ ఔషధం క్రియాశీలకం చేసి కసరత్తుల ఫలితాన్ని అందిస్తుంది.

ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఔషధాన్ని ఇటీవల ఎలుకలకు ఇవ్వగా అద్భుత పలితం వచ్చింది. ఈ ఔషధం వాడితే నిత్యం యంగ్‌గా కనిపించడంతో పాటు ఊబకాయం, గుండెపోటు, కిడ్నీ సమస్యలు వంటివేవి దరిచేరవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Sugar Facts: చక్కెర గురించి ఎవరైనా ఇలా చెబితే అస్సలు నమ్మొద్దు!


ఈ టాబ్లెట్ వేసుకుంటే ఇక కసరత్తులు అక్కర్లేదా..? అంటే అలా అస్సలు భావించొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కసరత్తులకు ప్రత్యామ్నాయం లేనేలేదని తేల్చి చెప్పారు. ‘‘ఎక్సర్‌సైజులకు మించినది లేదు. ఏ రకంగా చూసినా కసరత్తులు శరీరానికి చాలా ముఖ్యం. కానీ, చాలా మందికి ఇలాంటి అవకాశం ఉండదు. రోగులు, లేదా ఇతర కారణాలతో మంచానికి పరిమితమైన వారికి ఇది ఉపకరిస్తుంది. ఎక్సర్‌సైజుల లేమితో కలిగే కండరాల క్షీణతను నిరోధిస్తుంది. ఇంకా అనేక ఇతర ప్రయోజనాలు చేకూరుస్తుంది’’ అని ఈ ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త బాహా ఎల్గెండీ చెప్పుకొచ్చారు.

దీన్ని కసరత్తులకు జోడీగా వాడితే మరిన్ని ప్రయోజనాలు కలగొచ్చని అభిప్రాయపడ్డారు. మధుమేహం, ఊబకాయ నిరోధక మందులతో కలిపి వాడొచ్చని అన్నారు. ఈ ఔషధం టాబ్లెట్ రూపంలో మరో ఐదేళ్లల్లో రావచ్చని ఎల్గెండీ చెప్పారు. అయితే, ఈ ఔషధానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసేందుకు సుదీర్ఘకాలం ప్రీ క్లినికల్ టెస్టింగ్ అవసరమని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 08:46 PM

Advertising
Advertising