ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: రైలు కిటికీ అద్దాలు పగలగొట్టిన ప్యాసెంజర్లు.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

ABN, Publish Date - Dec 21 , 2024 | 05:31 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ రైల్వే స్టేషన్‌లో నిలిచున్న అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ కిటికీ అద్దాలను ప్రయాణికులు రాళ్లతో పగలగొట్టిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి జనాలు షాకైపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లల్లో సేవాలోపాలపై ప్రయాణికులు నిత్యం సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తుంటారు. మరికొందరు తాము రిజర్వ్ చేసుకున్న సీట్లను జనరల్ బోగీలోని ప్రయాణికులు ఆక్రమించుకుంటున్నారంటూ ఫిర్యాదు చేస్తుంటారు. అయితే, తాజా వీడియోలో మరింత షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ రైల్వే స్టేషన్‌లో నిలిచున్న అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ కిటికీ అద్దాలను ప్రయాణికులు రాళ్లతో పగలగొట్టిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).

Viral: శోభనం రాత్రి వధువు కోరిక విని షాక్! పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు


ముంబైకి వెళ్లాల్సిన ఆ రైలు తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో కోపంతో ఊగిపోయిన ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారట. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి రాయితో అద్దం పగలగొడితే మరో వ్యక్తి కిటికీకున్న ఐరన్ గ్రిల్‌ను తొలగించే ప్రయత్నం చేశాడు.

‘‘ప్యాసెంజర్లు కోపంతో ఊగిపోయారు. 15101 అంత్యోదయ కోచ్ తలుపులు తెరుచుకోవట్లేదని కిటికీ అద్దాలు పగలగొట్టారు. ట్రెయిన్ వద్ద పెను కలకలమే రేపారు. ఆ రైలు ఛప్రా నుంచి ముంబై వెళుతోంది’’ అని ఓ వ్యక్తి వీడియోను షేర్ చేశారు.

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!


కాగా, ఈ వీడియో ఆన్‌లైన్ బాట పట్టిన క్షణం నుంచే విపరీతంగా వైరల్ అవుతోంది. అనేక మంది రకరకాల వ్యాఖ్యలతో కామెంట్ సెక్షన్‌ను హోరెత్తించారు. రైలు లోపలున్న ప్రయాణికుల భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక రౌడీ ముఠాలు స్టేషన్లలో స్వైర విహారం చేస్తాయి. వాళ్ల వద్ద టిక్కెట్టు లేదు. వాళ్లసలు ప్యాసెంజర్లే కాదు. శతాబ్దాల తరబడి తీసుకున్న ఎన్నో చర్యల కారణంగా రైలు ప్రయాణం భద్రంగా మారింది. కానీ ఈ నిర్లక్ష్యం కారణంగా దొంగలు రౌడీల విచ్చలివిడి సంచారం నాటి పాత రోజులు మళ్లీ తిరిగొస్తాయనిపిస్తోంది’’ అని ఓ వ్యక్తి అన్నారు. ‘‘రైలు ఎక్కిన ప్రతిసారీ తనకు ఇలాంటి ప్రమాదం ఎదురవుతుంది’’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. మనకు సివిక్ సెన్స్ రావాలంటే మరో అర్థశతాబ్దమైనా పడుతుంది. అని మరో వ్యక్తి నిట్టూర్చాడు. ఇలారకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

Viral: యువకుడికి షాక్! పెళ్లికోసమై వలలో పడి.. రూ.55 లక్షల నష్టపోయి..

Viral: ద్రవ్యోల్బణం పీక్స్‌కెళ్లడం అంటే ఇదీ! కప్పు కాఫీ ధర ఎంతో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Dec 21 , 2024 | 05:35 PM