Viral Vidoe: పార్కింగ్ విషయంలో లొల్లి.. బ్యాట్‌తో కారును ధ్వంసం చేసి హల్‌చల్
ABN , Publish Date - Aug 27 , 2024 | 09:56 AM
ఓ కార్(car) పార్కింగ్ గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ పెరిగి, అది కాస్తా తిట్టుకోవడం, కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఆ క్రమంలోనే అక్కడి వ్యక్తుల్లో పలువురు కోపోద్రిక్తులై కారు అద్దాలను కర్రలు, క్రికెట్ బ్యాటుతో తీవ్రంగా ధ్వంసం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ చోట రోడ్డుపై రెడ్ కాలర్ కార్(car) పార్కింగ్ చేశారు. అదే సమయంలో గమనించిన పలువురు వారితో వాదించారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. అది కాస్తా తిట్టుకోవడం, కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఆ క్రమంలోనే అక్కడి వ్యక్తుల్లో పలువురు కోపోద్రిక్తులై కారు అద్దాలను కర్రలు, క్రికెట్ బ్యాటుతో తీవ్రంగా ధ్వంసం చేశారు. ఆ క్రమంలోనే చట్టుపక్కన ఉన్న కొంత మంది అందుకు సంబంధించిన వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో తెగ వైరల్(viral video) అవుతోంది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 72లో చోటుచేసుకుంది.
పోలీసులు
వైరల్ వీడియోను గుర్తించిన కొత్వాలి సెక్టార్ 113 పోలీసులు ఇరువర్గాలను రమ్మని పిలిచి ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కార్ పార్కింగ్ విషయంలో నోయిడా సెక్టార్ 72లో నివాసముంటున్న రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య ఆదివారం సాయంత్రం గొడవ జరిగింది. ఆ క్రమంలో నితిన్ తరపు వ్యక్తులు మొదట రాజీవ్ చౌహాన్‌ను కొట్టారు. ఆ తర్వాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు నితిన్ కారును తీవ్రంగా ధ్వంసం చేశారు. ఆ క్రమంలో కర్రలు, క్రికెట్ బ్యాటుతో కారును పూర్తిగా ధ్వంసం చేయడం వీడియోలో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కేసు నమోదు
మూడు నిమిషాల 12 సెకన్ల వీడియోలో ఇరువర్గాల వ్యక్తులు ఒకరినొకరు దూషించుకోవడం, కొట్టుకోవడం కనిపిస్తుంది. వీడియోలో ఓ వ్యక్తి క్రికెట్ బ్యాట్ పట్టుకుని కారు అద్దాలు, లైట్లను పూర్తిగా పగలగొట్టడం కనిపిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ విషయంలో ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని ఏసీపీ శైవ్య గోయల్ తెలిపారు. ఈ వ్యవహరంలో నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే అసలు ఈ గొడవలో ఎవరిది తప్పు, ఎందుకు గొడవ జరిగిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: నాగుపాము పడగ విప్పితే.. పెద్ద పులి అయినా తోకముడవాల్సిందే.. వీడియో వైరల్!
Viral: ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే జిలేబీ తెమ్మన్నారు.. అసలు కథ ఏంటంటే..!
Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న కుక్క ఎమోజీని కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి