ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Trending News: ఎన్నికల వేళ ఆ దేశంలో సిగరెట్, కాఫీలకు తెగ డిమాండ్..!!

ABN, Publish Date - Feb 12 , 2024 | 05:35 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండోనేషియాలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫిబ్రవరి 14న దేశంలో ఓటింగ్ సందర్భంగా సిగరెట్లు, కాఫీలకు డిమాండ్ పెరుగుతోంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండోనేషియాలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫిబ్రవరి 14న దేశంలో ఓటింగ్ సందర్భంగా సిగరెట్లు, కాఫీలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ముందు ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలో ప్రతిసారీ మార్పులు సంభవిస్తుండటం గమనార్హం. ఈ ఎన్నికలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో అన్నారు.

సాధారణంగా ఎన్నికల ముందు నిర్వహించే ప్రచారం సమయంలో సిగరెట్ వంటి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. సమావేశాలు, భేటీలు, చర్చలు, పిచ్చాపాటి కబుర్లు ఇలా ఎన్నో ఉంటాయి. ప్రజలు ఒకే దగ్గరికి చేరుతుంటారు. వారిని మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు సిగరెట్లు, కాఫీలు అందిస్తారు. ఇండోనేషియా కస్టమ్ అండ్ ఎక్సైజ్ ఏజెన్సీ ప్రకారం 2019 ఎన్నికల సీజన్‌లో సిగరెట్ ఉత్పత్తి నెలవారీ 24.36 నుంచి సుమారు 29.6 బిలియన్లకు పెరిగింది.


కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం జరుపుకోనుండగా ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో సగం కంటే ఎక్కువ మంది యువ ఓటర్లు తమ తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటు వేయనున్నారు. ఆ దేశంలో 50 శాతానికి పైగా యువ ఓటర్లు ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇప్పటికే రెండు సార్లు తన పదవీ కాలాన్ని పూర్తి చేయడం విశేషం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 05:35 PM

Advertising
Advertising