ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: నేను చేసిన తప్పు మీరు చేయొద్దంటూ విన్నపం.. రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డరిచ్చి ఇతడు చేసిన తప్పు ఏంటంటే..

ABN, Publish Date - Mar 16 , 2024 | 07:10 PM

రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి చిన్న పొరపాటు కారణంగా భారీ షాక్ తిన్నాడు. ఈ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకున్న అతడు జరిగిన ఉదంతం గురించి నెట్టింట పంచుకున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి చిన్న పొరపాటు కారణంగా భారీ షాక్ తిన్నాడు. ఈ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకున్న అతడు జరిగిన ఉదంతం గురించి నెట్టింట పంచుకున్నాడు. తను చేసిన తప్పు మరెవరూ చేయొద్దంటూ విజ్ఞప్తి చేశాడు. ఆస్ట్రేలియాలో (Australia) వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

Viral Video: అబ్బబ్బ.. ఈ టాలెంట్ మామూలుగా లేదుగా.. టిఫిన్ సెంటర్‌లో ఇతడేం చేస్తున్నాడో చూస్తే..

లీ అనే వ్యక్తి ఇటీవల డార్విన్‌లోని ఓ రెస్టారెంట్‌కు బ్రేక్‌ఫాస్ట్ (Restaurant) కోసం వెళ్లాడు. అక్కడ తనకు నచ్చినవి ఆర్డరిచ్చాడు. వాస్తవానికి అతడు ఆర్డరిచ్చిన ఫుడ్ ఐటెమ్స్ సాధారణమైనవే. రెండు రోల్స్, ఒక ఐస్డ్‌టీ తీసుకున్నాడు. అతడు టిఫిన్ ముగించాక రెస్టారెంట్ బిల్లు చూసి మనోడి గుండె జారిపోయింది. అతడి టిఫిన్ ఖర్చు ఏకంగా 77 డాలర్లు అయ్యిందని వారు చెప్పారు. షాకింగ్ విషయం ఏంటంటే ఆ రోజు ఆదివారం కావడంతో రెస్టారెంట్ సర్‌చార్జ్ (Surcharge on Sunday) కూడా విధించింది. దీంతో బిల్లు (దాదాపు రూ.4000) తడిసిమోపెడైంది. అయితే, ఫుడ్ రుచిగా ఉండటంతో తనని తాను సమాధాన పరుచుకున్న లీ ఆ మొత్తం చెల్లించి బయటపడ్డాడు.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..


ఆనక తన అనుభవం గురించి లీ నెట్టింట పంచుకున్నాడు. మెనూ కార్డు చూడకుండా చూడకుండా, ధరల గురించి సరిగా వాకబు చేయకుండా నచ్చింది తినేయడంతోనే ఈ సమస్య వచ్చిందని అన్నాడు. తిండి కూడా ఖరీదైన వ్యవహారంగా మారడానికి కారణం కార్పొరేట్లేనని అతడు మండిపడ్డాడు. వాళ్ల దురాశ వల్లే సామాన్యులు ధరాభారం కింద నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..

అతడి పోస్టుపై నెట్టింట పెద్ద చర్చ జరిగింది. ఆదివారం అయినందుకు సర్‌చార్జ్ వేయడం ఎక్కడా చూడలేదని కొందరు ఆశ్చర్యపోయారు. సర్‌చార్జ్ లేకపోయినా బ్రేక్‌ఫాస్ట్ కోసం 70 డాలర్లు చెల్లించడం మామూలు విషయం కాదని కొందరు అన్నారు. రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ధరల గురించి వాకబు చేయకుండా అస్సలు ఆర్డర్ పెట్టకూడదని మరికొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 07:18 PM

Advertising
Advertising