World's Longest Dosa: ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ ఇదే! సైజ్ చూస్తే ఆశ్చర్యపోతారు!
ABN, Publish Date - Mar 19 , 2024 | 06:43 PM
ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ ఇదే
ఇంటర్నెట్ డెస్క్: ఒక అడుగు మేర ఉన్న దోశ కామన్.. ఐదు అడుగులు ఉంటే బాహుబలి దోశ..దీన్ని తినడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మరి 123 అడుగుల దోశ కూడా ఉందంటే నోరెళ్ల బెట్టాల్సిందే. అందుకే ఈ దోశకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Guiness Records) చోటు దక్కింది.
Viral: సముద్రగర్భంలో దాగున్న వేల కోట్ల నిధి.. వెలికి తీసేందుకు రంగంలోకి దిగిన కంపెనీ!
ఎమ్‌టీఆర్ ఫుడ్స్ సంస్థ 100వ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులోని ఎమ్‌టీఆర్ ఫ్యాక్టరీలో షెఫ్ రెజీ మ్యాథ్యూ ఆధ్వర్యలోని బృందం మార్చి్ 15న ఈ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన దోశగా (World's Longest Dosa) రికార్డుకెక్కిన దీని వీడియోను ఆయన తాజాగా నెట్టింట పంచుకున్నారు. దోశ అద్భుతంగా రావడంతో షెఫ్‌ల బృందం హర్షం వ్యక్తం చేయడం వీడియోలో చూడొచ్చు. గిన్నిస్ రికార్డు ధృవపత్రంతో దిగిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ఈ చారిత్రాత్మక క్షణం కోసం సాయమందించిన ఎమ్ఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు, లార్మన్ గ్రూప్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇక వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. గిన్నిస్ రికార్డు కొల్లగొట్టిన షెఫ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు, దోశ సైజు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇంత పెద్ద దోశను తినాలంటే ఎంతమంది అవసరం అవుతారో? అంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2024 | 06:52 PM