Viral: వామ్మో.. వీఐపీ బాత్రూమ్‌లంట! రూ.1000! షాక్‌లో కస్టమర్లు!
ABN , Publish Date - Sep 17 , 2024 | 04:21 PM
కనీసం వెయ్యి రూపాయల షాపింగ్ చేసిన వారికి మంచి రెస్ట్‌రూంల్లోకి అనుమతిస్తూ ఇతరులను అపరిశుభ్ర బాత్రూంలకు పంపిస్తున్న ఓ బెంగళూరు షాపింగ్ మాల్‌పై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వీఐపీ హోటల్ గదుల గురించి విన్నాం. ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ లాంజ్‌ల గురించి కూడా తెలుసు. కానీ వీఐపీ బాత్‌రూం గురించి ఎప్పుడైనా విన్నారా? బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ మాత్రం ‘వీఐపీ’ బాత్‌రూంలు ఉన్నాయని చెబుతున్నాడు. వీటిని ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌పై సోషల్ మీడియా వేదికగా అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది (Viral).
Viral: పొట్టపై సాలీడు కుడితే ఇంత ప్రమాదమా! ఇతడికి ఏమైందో తెలిస్తే..v
Deskkey9633 అనే రెడిట్ యూజర్ ఈ పోస్టు పెడుతూ ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌పై దుమ్మెత్తిపోశాడు. ‘‘వైట్‌ఫీల్డ్‌లో నాకు ఈ రోజు ఓ ఘటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీని గురించి జనాలకు కూడా తెలియాలని ఈ పోస్టు పెడుతున్నా’’ అంటూ అతడు తన ఆవేదన వెళ్లగక్కాడు. ఇటీవల ఓ రోజు తాను ఆ షాపింగ్ మాల్‌కు వెళ్లాలని, అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బాత్రూమ్ వెళితే అక్కడో సెక్యూరిటీ గార్డు తనను అడ్డుకుందని చెప్పాడు. ‘‘నా షాపింగ్ బిల్లు చూపించమని కోరింది. దీంతో, నేను షాకైపోయా. ఆ తరువాత మరో వ్యక్తి ద్వారా అసలు విషయం ఏంటో తెలిసింది. ఆ బాత్రూమ్ వాడుకోవాలంటే కనీసం రూ.1000 షాపింగ్ చేయాలట. సెక్యురిటీ గార్డు నన్ను మరో అంతస్తులో ఉన్న రెస్ట్ రూంకు వెళ్లమని చెప్పింది. అక్కడికెళ్లాక బాత్రూమ్‌లో అపరిశుభ్రత చూసి షాకైపోయా. అందరినీ అక్కడికే పంపిస్తుండటంతో దారుణ పరిస్థితి కనిపించింది. కనీసం ఫ్లష్ కూడా పనిచేయలేదు’’ అని చెప్పుకొచ్చాడు (Bengaluru Mall Sparks Outrage Over 1000 rs Requirement for VIP Restroom Access).
Viral: తల్లి ఇంట్లో లేకపోతే ఇంతే.. పిల్లలను రిస్క్‌లో పడేసిన తండ్రి!
నమ్మశక్యంగా లేని ఆ పరిస్థితి చూశాక తాను నోరెళ్లబెట్టానన్నాడు. రెస్ట్ రూంల విషయంలో షాపింగ్ మాల్ అనుసరించిన విధానాన్ని అతడు తప్పు పట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో నిర్వహణ సరిగా లేని రెస్ట్ రూంలు వినియోగించమనడం సబబు కాదని అన్నాడు. ‘‘అది నిజంగా వీఐపీ రెస్ట్ రూం అని అనుకున్నా ఇతర రెస్ట్ రూంల నిర్వహణ సరిగా లేకపోవడాన్ని ఏ విధంగానూ సమర్థించుకోలేరు. ఇలాంటి పాలసీని నేను మరే షాపింగ్ మాల్‌లోనూ చూడలేదు. ఇది చాలా ఆందోళనకరం. ఇది అనవసర సామాజిక అంతరాలు సృష్టించినట్టే’’ అని అభిప్రాయపడ్డాడు.
Viral: అప్పులోళ్లకు రైతు బిడ్డ షాక్! లోన్ కట్టలేదని ట్రాక్టర్ తీసుకెళుతుంటే..
దీనిపై సహజంగానే నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇది తప్పని అనేక మంది అభిప్రాయపడ్డారు. షాపింగ్ మాల్‌లో బాత్రూమ్ వినియోగించుకున్నందుకు రూ.20 విరాళం కింద ఇచ్చిన ఘటనలను ప్రస్తావించారు. ‘‘ఒకప్పుడు బలవంతంగా రూ.20 డోనేషన్ కింద తీసుకునే వారు. ఇప్పుడు దాని స్థానంలో ఈ పాలసీ తెచ్చారన్న మాట’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..
Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?